Share News

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ కొత్త బిజినెస్.. కోహ్లీ స్టైల్‌లో..!

ABN , Publish Date - Jun 18 , 2025 | 02:45 PM

టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను అతడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ కొత్త బిజినెస్.. కోహ్లీ స్టైల్‌లో..!
Mohammed Siraj

టీమిండియా క్రికెటర్లు ఒకవైపు జాతీయ జట్టుకు ఆడుతూనే మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ దుమ్మురేపుతున్నారు. అదే సమయంలో అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో నటిస్తూ ఏటికేడు కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇలా వచ్చిన డబ్బులతో కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములు అవడం లేదా కొత్త బిజినెస్ మొదలుపెట్టడం లాంటివి చేస్తున్నారు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ కూడా ఇప్పుడు ఇదే తోవలో నడుస్తున్నాడు. అతడు కొత్తగా ఓ వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. మరి.. మియా ప్రారంభించిన ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

mohammed-siraj.jpg


విభిన్న రుచులతో..

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీలాగే సిరాజ్ కూడా రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. జొహార్ఫా పేరుతో ఒక కొత్త ప్రీమియం రెస్టారెంట్‌ను మొదలుపెట్టాడు సిరాజ్. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో గల ఈ రెస్టారెంట్‌లో కస్టమర్ల కోసం మొఘలాయి, పర్షియన్‌తో పాటు అరేబియన్, చైనీస్ లాంటి విభిన్న రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జోరుగా సన్నద్ధమవుతున్నాడు సిరాజ్. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు కాబట్టి బౌలింగ్ అటాక్‌ను లీడ్ చేయాల్సిన బాధ్యత సిరాజ్ మీదే ఉంది. ఆ రకంగా మన జట్టు గెలుపోటముల్లో మియా మ్యాజిక్ చాలా కీలకపాత్ర పోషించబోతున్నాడు. మరి.. టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానులు తన మీద పెట్టుకున్న అంచనాలను మహ్మద్ సిరాజ్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.


ఇవీ చదవండి:

ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. స్ట్రీమింగ్ అందులోనే!

రోహిత్ రికార్డ్ సమం చేసిన మ్యాక్స్‌వెల్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 03:27 PM