Share News

IND vs ENG Live Streaming: ఎల్లుండి నుంచే ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే!

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:55 PM

అభిమానుల ఎదురుచూపులకు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ శుక్రవారం నుంచి మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎక్కడ లైవ్ టెలికాస్ట్ అవనుందో ఇప్పడు చూద్దాం..

IND vs ENG Live Streaming: ఎల్లుండి నుంచే ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే!
IND vs ENG Live Streaming

భారత్-ఇంగ్లండ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రెండు బడా టీమ్స్ మధ్య ఈసారి టెస్ట్ వార్ ఎలా జరుగుతుందో చూడాలని అనుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో కుర్రాళ్లతో నిండిన టీమిండియా పటిష్టమైన ఇంగ్లీష్ టీమ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ వెయిటింగ్‌కు మరో రెండ్రోజుల్లో ఫుల్‌స్టాప్ పడనుంది. జూన్ 20 (శుక్రవారం) నుంచి ఈ రెండు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఇండో-ఇంగ్లండ్ ఫైట్‌ ఎక్కడ లైవ్ టెలికాస్ట్ కానుందో ఇప్పుడు చూద్దాం..

Team India


ఇక్కడ చూసేయండి..

ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ మ్యాచులన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానల్స్‌లో టెలికాస్ట్ కానున్నాయి. టీవీలో లైవ్ కావాలంటే సోనీ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. అదే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయాలనుకుంటే జియో హాట్‌స్టార్ యాప్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు లీడ్స్ ఆతిథ్యం ఇస్తోంది. జులై 2 నుంచి 6 నడుమ బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్ట్‌ జరుగుతుంది. అదే నెల 10 నుంచి 14వ తేదీ నడుమ జరిగే మూడో టెస్ట్‌కు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి 27 వరకు నాలుగో లెస్ట్, జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతాయి.


ఇవీ చదవండి:

రోహిత్ రికార్డ్ సమం చేసిన మ్యాక్స్‌వెల్

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 02:04 PM