Share News

Rinku Singh: బ్యాట్ పట్టి చెలరేగిన రింకూ కాబోయే సతీమణి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 17 , 2025 | 08:29 PM

టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ కాబోయే సతీమణి ప్రియా సరోజ్ బ్యాట్ పట్టి చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Rinku Singh: బ్యాట్ పట్టి చెలరేగిన రింకూ కాబోయే సతీమణి.. వీడియో వైరల్!
Priya Saroj

టీమిండియా డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడికి ఇటీవలే నిశ్చితార్థం అయింది. జూన్ 8న లక్నోలో వైభవంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు భువనేశ్వర్ కుమార్, పీయుష్ చావ్లా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ క్రికెటర్లు తరలివచ్చారు. వీళ్లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. గ్రాండ్‌గా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక తర్వాత నుంచి రింకూ కాబోయే సతీమణి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో ప్రియా సరోజ్ క్రికెట్ వీడియోతో మరోమారు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

rinku.jpg


రెండో బంతికి..

వారణాసిలోని ఓ మినీ స్టేడియం ప్రారంభోత్సవానికి హాజరైంది ప్రియా సరోజ్. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆమెను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరారు. దీంతో బ్యాట్ పట్టిన ప్రియా సరోజ్.. రెండు బంతుల్ని ఎదుర్కొంది. అయితే తొలి బంతికి ఆమె షాట్ గట్టిగానే కొట్టినా కనెక్ట్ కాలేదు. రెండో బంతిని మాత్రం సరిగ్గా చూసి లాఘవంగా కొట్టింది. బాల్ చాలా దూరం వెళ్లడంతో ఆమె నవ్వుల్లో మునిగిపోగా.. అక్కడనున్న వారు చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. రింకూ కాబోయే వైఫ్ సందడి మామూలుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది నవంబర్ 18వ తేదీన రింకూ-ప్రియ వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అప్పుడే మొదలయ్యాయని తెలుస్తోంది.


ఇవీ చదవండి:

గిల్‌‌కు పరువు సమస్య

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 08:32 PM