Share News

Jasprit Bumrah: నాకూ ఫ్యామిలీ ఉంది.. డబ్బులు సంపాదించాలి.. టెస్ట్ క్రికెట్‌పై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 18 , 2025 | 10:22 AM

గతంలో టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉండేది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తా చాటిన వారినే ఉత్తమ క్రికెటర్లుగా పరిగణించేవారు. క్రమం తప్పకుండా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ దాదాపుగా తగ్గిపోయింది.

Jasprit Bumrah: నాకూ ఫ్యామిలీ ఉంది.. డబ్బులు సంపాదించాలి.. టెస్ట్ క్రికెట్‌పై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah

గతంలో టెస్ట్ క్రికెట్ (Test cricket) అంటే ఎంతో గౌరవం ఉండేది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సత్తా చాటిన వారినే ఉత్తమ క్రికెటర్లుగా పరిగణించేవారు. క్రమం తప్పకుండా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతుండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ దాదాపుగా తగ్గిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ (ICC) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం పెద్దగా ఉండడం లేదు. ప్రముఖ ఆటగాళ్లు కూడా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారు.


తాజాగా టీమిండియా స్టార్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచస్థాయి బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కూడా టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేనని తేల్చేశాడు. తాజాగా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్‌తో మాట్లాడిన బుమ్రా టెస్ట్ క్రికెట్‌పై తన మనసులో మాటలను బయటపెట్టాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలా, వద్దా అనే విషయంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఉండాలని అన్నాడు.


'టెస్ట్ క్రికెట్‌ను వదిలేయాలనుకునే వారి నిర్ణయాన్ని గౌరవించాలి. రెడ్ బాల్ క్రికెట్‌లోని ఒత్తిడిని తట్టుకునేందుకు శరీరం సిద్ధంగా లేకపోతే తప్పుకోవడం ఉత్తమం. టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. బౌలర్లు బ్యాట్ వెనుక దాక్కోలేరు. ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. మనకూ కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం డబ్బులు సంపాదించాలి. ఎవరైనా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే వారిని జడ్జ్ చేయడం ఆపాలి. అయితే టెస్ట్ క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే మీకు ప్రపంచవ్యాప్తంగా గౌరవం లభిస్తుంది' అని బుమ్రా అన్నాడు. కొన్ని రోజుల క్రితం కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.


ఇవీ చదవండి:

గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 10:22 AM