Home » Jasprit Bumrah
బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. తనకు కఠిన సవాళ్లు అంటే ఇష్టమని బుమ్రా పేర్కొన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ ఉండడం ఏ జట్టుకైనా వరం. వికెట్లు తీయాల్సి వచ్చినా, పరుగులు నియంత్రించాల్సి వచ్చినా, కెప్టెన్‌గా ఎవరున్నా, బుమ్రా చేతికి బంతినివ్వాల్సిందే. భారతదేశం వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం విండీస్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ బుమ్రాకు అందింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించాడు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్-యూఎస్ఏ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గతంలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కొడుకు కలిసి సరదాగా గడిపాడు. బుమ్రా కుమారుడు అంగద్ బౌలింగ్ చేసిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుమ్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.