Jasprit Bumrah: భారీ రికార్డుకు చేరువలో బుమ్రా
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:59 AM
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా(Jasprit Bumrah) ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. మరో వికెట్ తీస్తే.. బుమ్రా టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఉన్నారు. ఆస్ట్రేలియాతో ఇవాళ(నవంబర్ 8) జరగనున్న ఐదో టీ20లో బుమ్రా ఈ ఫీట్ అందుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు టీమిండియా తరఫున టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్(105) ఇప్పటికే ఈ ఫీట్ అందుకున్నాడు.
మరో నాలుగు రన్స్ చేస్తే..
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) మరో నాలుగు పరుగులు చేస్తే టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఆస్ట్రేలియాతో ఐదో టీ20లో ఈ రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. మరో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) కూడా వెయ్యి పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 11 రన్స్ చేస్తే ఈ ఫీట్ అందుకుంటాడు. భారత్‌తో జరిగే ఐదో టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొడితే టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటారు.
వంద వికెట్లు తీసిన బౌలర్లు..
* లసిత్ మలింగ.. టెస్ట్ వికెట్లు(101), వన్డే వికెట్లు(338), టీ20 వికెట్లు(107).
* షకిబ్ అల్ హసన్..టెస్టు వికెట్లు(246), వన్డే వికెట్లు(317), టీ20 వికెట్లు(149).
* టిమ్ సౌథీ.. టెస్టు వికెట్లు(391), వన్డే వికెట్లు(221), టీ20 వికెట్లు(164).
* షహీన్ అఫ్రిది.. టెస్టు వికెట్లు(121), వన్డే వికెట్లు(132), టీ20 వికెట్లు(122).
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో ధోనీ ఆడుతున్నాడు: సీఎస్కే సీఈఓ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి