Share News

ICC: మహిళా క్రికెట్.. ఐసీసీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:17 AM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది పెంచాలని నిర్ణయించింది.

ICC: మహిళా క్రికెట్.. ఐసీసీ కీలక నిర్ణయం
ICC

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్‌ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది.


నిషేధం ఉన్నా..

దుబాయ్‌లో ఐసీసీ(ICC) సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఐసీసీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను పది శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డు(ACB)పై నిషేధం ఉన్నా.. దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ కూడా భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.


మరోవైపు ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌(Mithali Raj)కు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్ట్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.


రేటింగ్స్ అదుర్స్..

మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ వీక్షణ పరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్ స్టార్‌లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక రేటింగ్. మరోవైపు భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా రికార్డు సృష్టించింది. ఫైనల్‌ను 18 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వీక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

భారత్ ఓటమి

ఐపీఎల్‌లో ధోనీ ఆడుతున్నాడు: సీఎస్కే సీఈఓ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 10:17 AM