Hong Kong Sixes 2025: భారత్ ఓటమి
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:42 AM
హాంకాంగ్ ఇంటర్నేషన్ సిక్సెస్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. పూల్-సిలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్.. నిర్ణీత ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: హాంకాంగ్ ఇంటర్నేషన్ సిక్సెస్(Hong Kong Sixes 2025)లో టీమిండియాకు షాక్ తగిలింది. పూల్-సిలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్.. నిర్ణీత ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులకే పరిమితమైంది.
టీమిండియా బ్యాటర్లలో అభిమన్యు మిథున్(26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాబాజ్ నదీమ్(19), ప్రియాంక్ పంచాల్(17) పరుగులు చేశారు. రాబిన్ ఊతప్ప డకౌట్‌గా వెనుదిరిగాడు. దినేశ్ కార్తీక్(8), స్టువర్ట్ బిన్నీ(2) నిరాశపర్చారు. కువైట్ బౌలర్లలో యాసిన్ పటేల్ 3, బిలాల్ తాహిర్, అద్నాన్ ఇద్రీస్ చెరో వికెట్ పడగొట్టారు. కువైట్ బ్యాటర్లలో కెప్టెన్ యాసిన్ పటేల్(56*) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బిలాల్ తాహిర్(25) రాణించాడు. అద్నాన్ ఇద్రీస్(6), సందరువాన్(7), మహ్మద్ షఫీక్(9) పరుగులతో నిలిచారు. భారత బౌలర్లలో అభిమన్యు మిథున్ 2, స్టువర్ట్ బిన్నీ, షాబాజ్ నదీమ్, దినేశ్ కార్తీక్ తలో వికెట్ పడగొట్టారు.
టోర్నీ నుంచి ఔట్
ఈ మ్యాచ్‌లో ఘోర పరాభవం పాలైన టీమిండియా(Team India).. టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూల్-సిలోని మిగతా జట్లు కువైట్, పాకిస్తాన్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. మిగతా రెండు జట్లు కూడా ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించగా.. కువైట్ చేతిలో ఓటమితో భారత్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. దీంతో పాక్, కువైట్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.
ఇవి కూడా చదవండి
Hockey India: హాకీ ఇండియా సెంచరీ
2029 Womens World Cup: వచ్చేసారి పది జట్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి