Virat Kohli Jersey: 18 నంబర్ జెర్సీ.. ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో ఇదే హైలైట్!
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:02 PM
ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు మరో రెండ్రోజుల సమయమే మిగిలి ఉంది. జూన్ 20వ తేదీ నుంచి లీడ్స్ వేదికగా ఈ సిరీస్ మొదలవనుంది. ఐదు టెస్టుల ఈ సుదీర్ఘ సిరీస్ కోసం అటు పర్యాటక భారత్, ఇటు ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు జోరుగా సన్నద్ధం అవుతున్నాయి. వరల్డ్ టెస్ట్ సిరీస్ నయా సైకిల్‌లో భాగంగా ఆడే తొలి సిరీస్ కావడంతో విజయంతో ఆరంభించాలని రెండు జట్లు పంతంతో ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, బెన్ స్టోక్స్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జో రూట్ వంటి చాలా మంది స్టార్లు ఆడుతున్నా.. జెర్సీ నంబర్ 18 చుట్టూనే చర్చలు నడుస్తున్నాయి.
ఇక చూడలేం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. సరిగ్గా ఇంగ్లండ్ టూర్‌కు ముందు అతడు వైదొలిగాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోహ్లీ చుట్టూనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. కింగ్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారు? విరాట్ స్థాయిలో జట్టులో అగ్రెషన్ చూపేదెవరు? ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అనేదెవరు? అతడి స్థాయిలో పరుగుల వర్షం కురిపించేదెవరు? ఇలాంటి చర్చలు రోజురోజుకీ పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. ఆఖరుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా 18 నంబర్ జెర్సీని ఇక చూడలేనంటూ ఎమోషనల్ అవుతున్నాడు. దీన్ని బట్టే ప్రపంచ క్రికెట్ మీద కోహ్లీ ఎలాంటి ముద్ర వేశాడో అర్థం చేసుకోవచ్చు.
సిగ్గుగా ఉంది..
‘విరాట్ కోహ్లీ పోరాటస్ఫూర్తిని టీమిండియా కచ్చితంగా మిస్ అవుతుంది. ప్రత్యర్థితో విరాట్ కలబడే తీరు అద్భుతం. తప్పక గెలవాల్సిందే అనే మైండ్‌సెట్‌తో కోహ్లీ ఆడేవాడు. 18 నంబర్ జెర్సీని అతడు స్పెషల్‌గా మార్చేశాడు. ఆ జెర్సీకి అతడు వన్నె తెచ్చాడు. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. ఆ జెర్సీని మళ్లీ గ్రౌండ్‌లో చూడలేకపోవడం బాధగా అనిపిస్తోంది’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. కోహ్లీతో ఆడలేకపోవడం సిగ్గుగా ఉందని, అతడితో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడ్ని అని ఇంగ్లండ్ కెప్టెన్ తెలిపాడు. తమ ఇద్దరిదీ ఒకే రకమైన మానసిక దృక్పథం అని పేర్కొన్నాడు స్టోక్స్.
ఇవీ చదవండి:
సిరాజ్ కొత్త బిజినెస్.. కోహ్లీ స్టైల్‌లో..!
ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. స్ట్రీమింగ్ అందులోనే!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి