Share News

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:54 PM

ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీడ్స్ టెస్టులో విజయంతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తోంది.

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!
IND vs END

ఇంగ్లండ్ టెస్ట్‌ను విజయంతో ప్రారంభించాలని చూస్తోంది టీమిండియా. లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టాలని అనుకుంటోంది. తమను తక్కువ అంచనా వేస్తున్న ప్రత్యర్థులు, విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది మెన్ ఇన్ బ్లూ. అందుకోసం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని యూనిట్లను బలోపేతం చేసుకునే పనిలో పడింది. అయితే అంతా బాగానే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక స్పాట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది భారత టీమ్ మేనేజ్‌మెంట్. అదే పేస్ ఆల్‌రౌండర్. అయితే ఈ విషయాన్ని తేల్చేశాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. అదేంటో ఇప్పుడు చూద్దాం..


అతడికే ఓటు..

లీడ్స్ టెస్ట్ కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్ దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అయితే పేస్ ఆల్‌రౌండర్ విషయంలోనే హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌లో ఎవర్ని తీసుకోవాలనేది ఇంకా డిసైడ్ చేయలేదట. ఈ విషయంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. నితీష్ కంటే శార్దూల్‌ను తీసుకోవడం బెటర్ అని అతడు సూచిస్తున్నాడు. కఠినమైనా సరే, ఈ నిర్ణయం తీసుకోక తప్పదని అంటున్నాడు.


నితీష్‌ను తీసుకోవాలంటే..

‘తొలి టెస్టులో భారత్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకోవాలి. వాళ్లతో పాటు శార్దూల్ ఠాకూర్‌ పేరు కూడా తుదిజట్టులో చేర్చాలి. శార్దూల్-నితీష్ కుమార్ రెడ్డిలో ఒకర్ని తీసుకోవడం అనేది సవాల్‌తో కూడుకున్నది. అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువగా బౌలింగ్ చేయగలరు, వికెట్లు తీయగలరనేది చూడాలి. ఒకవేళ నితీష్ 12 నుంచి 14 ఓవర్లు వేయగలడనే నమ్మకం ఉంటే అతడ్ని టీమ్‌లోకి తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ స్పెషలిస్ట్ కాబట్టి అతడ్ని వద్దనే అవకాశం కూడా ఉండదు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!

సిరాజ్ కొత్త బిజినెస్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 06:54 PM