Share News

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:06 PM

టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!
IND vs PAK

మహిళల క్రికెట్‌కు సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నుంచి ప్రపంచ కప్ మ్యాచులు ఆరంభమవుతాయి. ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగే తొలి పోరుతో మెగాటోర్నీ షురూ అవుతుంది. క్రికెట్ లవర్స్‌ ఎంతో ఆసక్తి చూపించే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరుగుతుంది. పాక్‌తో పోరు తర్వాత గ్రూప్ దశలో మరికొన్ని మ్యాచులు ఆడుతుంది టీమిండియా.

india-va-pakistan.jpg


ఒకే గ్రూపులో..

సౌతాఫ్రికాతో జూన్ 21న తలపడుతుంది భారత ఉమెన్స్ టీమ్. అదే నెల 28వ తేదీన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. మెగా టోర్నీలో మొత్తం 2 గ్రూపుల్లో 6 జట్ల చొప్పున ఉండనున్నాయి. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు ఆసీస్, ప్రొటీస్, పాకిస్థాన్ ఉన్నాయి. అలాగే రెండు క్వాలిఫికేషన్ టీమ్స్ కూడా ఈ గ్రూపులో ఉన్నాయి. అటు గ్రూప్-2లో ఆతిథ్య ఇంగ్లండ్ సహా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. అక్కడా రెండు క్వాలిఫయర్ టీమ్స్ ఉన్నాయి.

ind-vs-pak.jpg


గెలవక తప్పదు..

క్వాలిఫయింగ్ టీమ్స్‌ ఏవి అనేది వచ్చే ఏడాది ప్రథమార్థం లోపు తేల్చేస్తారు. 2026 జూన్ 30న తొలి సెమీఫైనల్, జులై 2వ తేదీన రెండో సెమీఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. జూన్ 5న ప్రతిష్టాత్మక ఫైనల్ ఫైట్ జరుగుతుంది. భారత్ నాకౌట్‌కు క్వాలిఫై అవ్వాలంటే పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాను కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. పేస్, బౌన్స్‌కు సహకరించే ఇంగ్లీష్ కండీషన్స్‌లో నెగ్గుకురావడం టీమిండియాకు అంత సులువేం కాదు. అయితే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ శర్మ, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంకా పాటిల్ లాంటి స్టార్లతో నిండిన భారత్ అంచనాలకు తగ్గట్లు రాణిస్తే ఫైనల్స్‌కు కూడా చేరుకోగలదు.


ఇవీ చదవండి:

సిరాజ్ కొత్త బిజినెస్.. కోహ్లీ స్టైల్‌లో..!

ఇండో-ఇంగ్లండ్ సిరీస్.. స్ట్రీమింగ్ అందులోనే!

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 04:12 PM