Chain Snatching Video: మహిళ మెడలో చైన్ లాగాలని చూశాడు.. చివరికి జరిగింది చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:15 AM
ఓ మహిళ తన కుమార్తెను స్కూటీపై తీసుకొచ్చి ఇంటి వద్ద దింపుతుంది. బాలిక స్కూటీ దిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. అయితే ఇంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు బైకులో వచ్చి ఆమె వద్ద ఆపేస్తారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఎటువైపు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందే చెప్పలేని పరిస్థితి. లైంగికంగా వేధింపులుకు గురి చేసేవారు కొందరైతే.. మరికొందరు మెడలో చైన్లు లాక్కుని పారిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలు మన చుట్టూ ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ దుండగుడు మహిళ మెడలో మంగళసూత్రం లాక్కెళ్లాని చూస్తాడు. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కుమార్తెను స్కూటీపై తీసుకొచ్చి ఇంటి వద్ద దింపుతుంది. బాలిక స్కూటీ దిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది. అయితే ఇంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు బైకులో వచ్చి ఆమె వద్ద ఆపేస్తారు.
Woman Viral Video: ఎందుకొచ్చిందో.. ఎందుకెళ్లిందో.. మెట్రోలో యువతి నిర్వాకం చూసి అంతా షాక్..
వారిలో ఓ వ్యక్తి కిందకు దిగి మహిళ మెడలోని మంగళసూత్రాన్ని (Thief tried to snatch mangalsutra from woman's neck) లాక్కోవాలని ప్రయత్నిస్తాడు. అయితే అతను చేయి వేయగానే.. వెంటనే ఆమె అలెర్ట్ అవుతుంది. అతడి చేయి పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెను విడిపించుకుని వారిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆమె మాత్రం అతడి చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నిస్తుంది. బైకుపై పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆమె మాత్రం అతన్ని వదలదు. కొంత దూరం ఇలా లాక్కెళ్తూ వెళ్లిన తర్వాత.. అతన్ని గట్టిగా లాగి కిందపడేస్తుంది. ఇంతలో చుట్టు పక్కల వారు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తారు.
స్థానికులు రావడాన్ని చూడగానే ఆ దొంగలు.. మంగళసూత్రాన్ని అక్కడే పడేసి అక్కడి నుంచి పారిపోతారు. స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డేరింగ్ డాషింగ్ ఉమన్ అంటే ఈమే’’.. అంటూ కొందరు, ‘‘చైన్ స్నాచర్లకు బాగా బుద్ధి చెప్పిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 5. 95 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Funny Viral Video: ఈ ఫ్యాన్‌ను ఆపడం ఎవరితరమూ కాదు.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..