Share News

Jugad Viral Video: ఐడియా అదిరింది బ్రదర్.. ఏసీని ఫ్రీగా ఎలా సెట్ చేశాడో చూడండి..

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:23 AM

వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఏసీని ఏర్పాటు చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

Jugad Viral Video: ఐడియా అదిరింది బ్రదర్.. ఏసీని ఫ్రీగా ఎలా సెట్ చేశాడో చూడండి..

ప్రస్తుతం ఎండలు ఏం రేంజ్‌లో దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మందిఇళ్లలో వేలకు వేలు ఖర్చు చేసి ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. అంత ఖర్చు చేయలేని వారు ఫ్యాన్లతోనే సరిపెట్టుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం అందుబాటులో ఉన్న వస్తువులతో ఏకంగా ఏసీనే ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి చేసిన వింత ప్రయోగం వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఏసీని ఏర్పాటు చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఐడియా అదిరింది బ్రదర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏసీ కొనేంత డబ్బులు లేని ఓ వ్యక్తి.. తన ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం ఇంట్లోని టేబుల్ ఫ్యాన్, ప్లాస్టిక్ పైపు, బకెట్ నీళ్లు (Table fan, plastic pipe, water bucket) తీసుకున్నాడు. అలాగే తన ఇంటి కిటికీ బయట గొలుసుల తరహాలో కూడిన జాలరీని ఏర్పాటు చేశాడు.

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..


బకెట్ నీటిలో పైపు పెట్టి, ఆ నీరు కిటికీ బయట ఉన్న జాలరీలో పడి, తిరిగి అదే పైపు గుండా బకెట్‌లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. తర్వాత ఇంట్లో కిటికీకి ఎదురుగా టేబుల్ ఫ్యాన్‌ను సెట్ చేశాడు. ఫైనల్‌గా తన ప్రయోగాన్ని పరీక్షించాడు. నీళ్లన్నీ కిటికీ బయట ఉన్న జాలరీ పడడం వల్ల.. ఆ చల్లదనం మొత్తం టేబుల్ ఫ్యాన్ గుండా ఇంట్లోకి వెళ్తోంది. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఏసీని (AC) సెట్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రూపాయి ఖర్చు లేకుండా ఏసీ.. ఐడియా అదిరిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఏసీని ఇలాక్కూడా ఏర్పాటు చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70 లక్షలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సమయాన్ని ఆదా చేయడమంటే ఇదేనేమో.. బస్సులో ఇతడి నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 09:28 AM