Share News

Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 07:39 AM

ఓ వ్యక్తి గాడిదకు వింత పరీక్ష పెట్టేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం గాడిద తలకు ఓ కర్రను కట్టేస్తాడు. ఆ కర్ర చివరన పెద్ద క్యారెట్‌ను వేలాడదీస్తాడు. తలకు ఎదురుగా క్యారెట్‌ను వేలాడదీయడం వల్ల.. దాన్ని తినడం గాడిదకు సాధ్యం కాదనేది అతడి ఉద్దేశం. అయితే చివరకు ఏం జరిగిందో చూడండి..

Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..

కొన్ని జంతువులు అత్యంత తెలివితేటలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకోవడం చూస్తుంటాం. మరికొన్ని జంతువులు మనుషులు కూడా చేయలేని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటాయి. ఇంకొన్ని జంతువులైతే ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి క్యారెట్‌తో గాడిదకు వింత పరీక్ష పెట్టాడు. చివరకు ఆ గాడిద ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గాడిదకు (Donkey) వింత పరీక్ష పెట్టేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం గాడిద తలకు ఓ కర్రను కట్టేస్తాడు. ఆ కర్ర చివరన పెద్ద క్యారెట్‌ను వేలాడదీస్తాడు. తలకు ఎదురుగా క్యారెట్‌ను (Carrot) వేలాడదీయడం వల్ల.. దాన్ని తినడం గాడిదకు సాధ్యం కాదనేది అతడి ఉద్దేశం. ఇలా తల ఎదురుగా క్యారెట్‌ను వేలాడదీసిన అతను.. పక్కకు వెళ్లి నవ్వుకుంటూ ఉంటాడు.

Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..


తన కళ్లెదురుగా ఉన్న క్యారెట్‌ను ఎలా తింటుందో చూడాలని ఎదురు చూస్తుంటాడు. అయితే ఈ పరీక్షలో ఆ గాడిద ఎంతో సింపుల్‌గా నెగ్గేస్తుంది. తలను నేలపై పెట్టడం వల్ల క్యారెట్ కూడా నేలపై ఉంటంది. తర్వాత క్యారెట్ వద్దకు తన తలను సులభంగా తీసుకెళ్లి మొత్తం తినేస్తుందన్నమాట. గాడిద క్యారెట్‌ను సులభంగా తినేయడం చూసి ఆ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఇలా ఈ వింత పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన గాడిదను చూసి అంతా అవాక్కవుతున్నారు.

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ గాడిద తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పరీక్షలో విజయవంతంగా పాస్ అయిపోయిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 27వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 07:59 AM