Share News

Deer Funny Video: జింకే కదా అని సెల్ఫీ దిగింది.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతింది..

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:52 PM

అడవిలో పర్యటిస్తున్న ఓ యువతికి మార్గ మధ్యలో ఓ జింక కనిపిస్తుంది. దాన్ని చూడగానే సమీపానికి వెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Deer Funny Video: జింకే కదా అని సెల్ఫీ దిగింది.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతింది..

చాలా మంది జంతువులతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చివరకు ప్రమాదంలో పడుతుంటారు. లైలెంట్‌గా కనిపిస్తున్నాయి కదా అని ఏనుగులు, కోతులు, గేదెలతో తమాషా చేయాలని చూస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు పరిస్థితులు తారుమారవుతుంటాయి. కొన్ని జంతువులు హెచ్చరిస్తే.. మరికొన్ని జంతువులు గట్టి షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి జికతో సెల్ఫీ దిగాలని చూడగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘జింకే కదా అని సెల్ఫీ దిగాలని చూస్తే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో పర్యటిస్తున్న ఓ యువతికి మార్గ మధ్యలో ఓ జింక కనిపిస్తుంది. దాన్ని చూడగానే సమీపానికి వెళ్లి నిలబడుతుంది. జింక కూడా ఆశ్చర్యకరంగా ఎటూ కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. దీంతో ఆ యువతి (woman tries to take selfie with deer) జింకతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంది.

Bullet Bike Theft Video: బుల్లెట్ బైకును రోడ్డు పక్కన పార్క్ చేస్తున్నారా.. ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే..


దగ్గరికి వెళ్లి మంచి ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. అనుకున్నట్లుగానే సెల్ఫీ కూడా తీసుకుంది. కానీ ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. అంతా అయిపోయాక తన చేయి జింక ముందు పెట్టి.. థ్యాంక్స్ చెప్పాలని చూస్తుంది. అయితే అప్పటిదాకా కెమెరాకు ఫోజ్ ఇచ్చిన జింక.. ‘‘పర్మిషన్ లేకుండా సెల్ఫీ తీసుకోవడమే కాకుండా షేక్ హ్యాండ్ కూడా కావాలా.. వెళ్లు ఇక్కడి నంచి’’.. అన్నట్తుగా కోపంతో ఆమె చేయిపై కొమ్ములతో కొడుతుంది. దీంతో ఆ యువతి షాక్.. అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది.

Monkey Helping Video: గోతిలో పడిపోయిన పిల్లి.. లోపలికి దూకిన కోతి.. చివరకు చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జింకే కదా అని తమాషా చేస్తే.. ఇలాగే అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘యువతికి భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 01:52 PM