Share News

Train Funny Video: ఈ ఫోన్ కొట్టేయడం అసాధ్యం.. రైల్లో ఇతడి జాగ్రత్తలు చూస్తే..

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:47 PM

రైల్లో కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులను టార్గెట్ చేసి ఫోన్లు లాక్కెళ్లే ఘటనలను చూస్తుంటాం. ఇలా జరగకుండా ఉండేందుకు ఓ వ్యక్తి వినూత్న ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Train Funny Video: ఈ ఫోన్ కొట్టేయడం అసాధ్యం.. రైల్లో ఇతడి జాగ్రత్తలు చూస్తే..

రైలు ప్రయాణ సమయాల్లో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. రైలు ఎక్కి, దిగే సమయంలో పక్కనే ఉండి పర్సులు కొట్టేవారు కొందరైతే.. మరికొందరు కిటికీల పక్కన కూర్చున్న వారిని టార్గెట్ చేసి, ప్రయాణికుల చేతుల్లోని ఫోన్లను లాక్కెళ్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కతున్నారు. ఫోన్‌ను ఎవరూ కొట్టేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి.. విచిత్రమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబై లోకల్ రైల్లో (Mumbai Local Train ) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్లో కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులను టార్గెట్ చేసి ఫోన్లు లాక్కెళ్లే ఘటనలను చూస్తుంటాం. అయితే ఇలా కిటికీ పక్కన కూర్చున్న ఓ వ్యక్తి.. తన ఫోన్ చోరీ కాకుండా ఉండేందుకు విచిత్ర ఏర్పాట్లు చేసుకున్నాడు.

Lion VS Wildebeest: వైల్డ్‌బీస్ట్‌పై సింహం దాడి.. చివరకు చుక్కలు కనిపించాయిగా..


ప్లాస్టిక్ బాక్స్‌ను వెంట తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఫోన్‌ను అందులో పెట్టాడు. ఫోన్ మాట్లాడాలనుకున్న సమయంలో ఫోన్ బాక్స్ మూత తీయడం, మాట్లాడడం (Phone in plastic box) అయిపోగానే మూత మూసేస్తున్నాడు. ఇలా ఫోన్‌ను బాక్స్‌లోనే పెట్టి వీడియోలు కూడా చూస్తున్నాడు. ఇలా దొంగలు తన ఫోన్‌ను చోరీ చేయకుండా ఇతను చేసుకున్న వింత ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ అంకుల్ ముందు జాగ్రత్త మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘బాక్స్ మొత్తాన్ని లాక్కెళ్తే పరిస్థితి ఏంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral: నన్ను ముట్టుకోవద్దు.. మొదటి రోజు వధువు వింత కండీషన్.. తర్వాత జరిగిందేంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 01:50 PM