Viral Video: సమయాన్ని ఆదా చేయడమంటే ఇదేనేమో.. బస్సులో ఇతడి నిర్వాకం చూస్తే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:41 AM
ఓ వ్యక్తి స్లీపర్ బస్సులో ప్రయాణం చేస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. తెల్లవారగానే కిటికీ అద్దం తెరచి మరీ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

సమయం ఎంతో విలువైనది. దీన్ని సద్వినియోగం చేసుకుని కొందరు తాము అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకుంటుంటారు. మరికొందరు ఒకే సమయంలో వేర్వేరు పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇంకొందరు సమయాన్ని సద్వినియోగం చేసుకునే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్లీపర్ బస్సులో వెళ్తున్న ఓ వ్యక్తి ఉదయం కిటికీ అద్దాలు తెరిచి చేస్తున్న నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘సమయాన్ని ఆదా చేయడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్లీపర్ బస్సులో ప్రయాణం చేస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. తెల్లవారగానే కిటికీ అద్దం తెరచి మరీ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సమయం వృథా అవుతుందని అనుకున్నాడో ఏమో గానీ.. ఓ వ్యక్తి బస్సు సిటీకి చేరుకోక ముందే కిటికీ అద్దం తీశాడు.
Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..
కిటికీ అద్దం తీసిన తర్వాత తన బ్యాగులోని అద్దం, షేవింగ్ క్రీమ్ బయటికి తీశాడు. గడ్డానికి క్రీమ్ పూసి.. (Man shaving on the bus) ఎంచక్కా సేవింగ్ చేసేశాడు. అంతా చూస్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా కిటికీ బయట తల పెట్టి మరీ షేవింగ్ చేసేశాడు. ఇలా తన గమ్యస్థానం వచ్చేలోపు నీట్‌గా షేవింగ్ చేసేసుకుని రెడీ అయిపోయాడన్నమాట. ఇతను చేసిన ఈ వింత నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
Viral Video: ఏం వాడుకుంటున్నార్రా... రైలు బోగీలో ఏముందో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సమయాన్ని ఆదా చేయడం ఎలాగో ఇతన్ని చూసి నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘బిజినెస్ క్లాస్ అంటే ఆ మాత్రం ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..