Share News

Lion Sad Video: వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పిల్ల సింహం.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి సింహం.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:42 PM

అడవిలో వేటకు వెళ్లిన పిల్ల సింహం.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. చలనం లేకుండా పడి ఉన్న పిల్ల సింహాన్ని చూసిన తల్లి సింహం.. పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. చివరకు తల్లి సింహం బాధను చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు..

Lion Sad Video: వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పిల్ల సింహం.. పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి సింహం.. చివరకు చూస్తే..

తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. మనుషుల కంటే జంతువులే ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాయి. పిల్లలను హింసించే తల్లులు ఉంటారు గానీ.. పిల్లలను హింసించే జంతువులు మాత్రం ఉండవు. పైగా తమ పిల్లలను ఏమాత్రం హాని కలిగినా విలవిల్లాడిపోతుంటాయి. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సింహం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్ల సింహం చనిపోవడంతో తల్లి సింహం విల్లవిల్లాడిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో వేటకు వెళ్లిన పిల్ల సింహం.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. చలనం లేకుండా పడి ఉన్న పిల్ల సింహాన్ని చూసిన తల్లి సింహం.. పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. కదలకుండా పడి ఉన్న తన పిల్లను చూసి కాలితో అటూ, ఇటూ కదిపింది.

Funny Tomato Video: ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


అయినా చలనం లేకపోవడంతో చివరకు దానికి విషయం అర్థమైంది. తన కళ్ల ముందే తన పిల్ల చనిపోవడాన్ని ఆ తల్లి సింహం జీర్ణించుకోలేకపోయింది. తల పైకి పెట్టి నోరు తెరచి తన బాధను వ్యక్తం చేసింది. ‘‘అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా నాన్నా.. ’’.. అన్నట్లుగా ఆ తల్లి సింహం (Mother lioness cries after seeing her dead cub) బాధపడుతూ తన పిల్లను చూస్తుండిపోతుంది. ఇంతలో మరో పిల్ల అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి అటూ, ఇటూ తిరుగుతూ ఉంటుంది.

Funny Viral Video: కారులో మాజీ ప్రధాని.. కారు బయట ఉష్ణ పక్షి.. చివరకు జరిగింది చూస్తే..


అలాగే దూరంగా నిలబడిన రెండు జిరాఫీలు తమ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మౌనంగా నిలబడి ఉంటాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి సింహాన్ని చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకలించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 01:42 PM