Share News

Funny Viral Video: కారులో మాజీ ప్రధాని.. కారు బయట ఉష్ణ పక్షి.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:09 PM

యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు టెక్సాస్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. కారులో వెళ్తూ ఉద్యాన వనంలోని జంతువులు, పక్షులను తిలకిస్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Funny Viral Video: కారులో మాజీ ప్రధాని.. కారు బయట ఉష్ణ పక్షి.. చివరకు జరిగింది చూస్తే..

యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురైన షాకింగ్ అనుభానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉద్యానవన సందర్శనానికి వెళ్లిన ఆయనకు ఓ ఉష్ణపక్షి షాక్ ఇచ్చింది. కారు వద్దకు వచ్చి మరీ అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు (Former UK Prime Minister Boris Johnson) టెక్సాస్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. జాన్సస్ తన భార్య, పిల్లలతో కలిసి టెక్సాస్‌లోని వన్యప్రాణుల ఉద్యాన వనాన్ని సందర్శించడానికి వెళ్లాడు. కారులో వెళ్తూ ఉద్యాన వనంలోని జంతువులు, పక్షులను తిలకిస్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దూరంగా ఉష్ణ పక్షి కనిపించడంతో ఆయన తన కారును ఆపేస్తాడు.

Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకలించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


జాన్సన్ పిల్లలు ఉష్ణ పక్షిని (Ostrich) ఆసక్తిగా తిలకిస్తుండగా.. సడన్‌గా కారు దగ్గరికి వస్తుంది. వచ్చీ రావడంతోనే తల కారులోపలికి పెట్టి జాన్సన్‌ను చేతిపై పొడుస్తుంది. దీంతో షాక్ అయిన అతను.. వెంటనే కారును వేగంగా ముందుకు పోనిస్తాడు. ఇలా యూకే మాజీ ప్రధానికి ఈ ఉష్ణ పక్షి ఊహించని షాక్ ఇచ్చిందన్నమాట. జాన్సన్ భార్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Jugad Viral Video: ఐడియా అదిరింది బ్రదర్.. ఏసీని ఫ్రీగా ఎలా సెట్ చేశాడో చూడండి..


ఈ ఘటన టెక్సాస్‌లోని ఏ ఉద్యానవనంలో జరిగిందో స్ఫష్టంగా తెలియకపోయినా.. ఆ తర్వాత జాన్సన్ కుటుంబం క్సాస్‌లోని గ్లెన్ రోజ్‌కు దగ్గరగా ఉన్న డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్‌ సందర్శించింది. అక్కడ పర్యటిస్తున్న చిత్రాలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బోరిస్ జాన్సన్‌ 2019 నుంచి 2022 వరకూ యూకే ప్రధానిగా పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈయన జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ మధ్యలో చిక్కుకుపోయిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. కాగా, తాజాగా షేర్ చేసిన ఈ ఉష్ణ పక్షి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా లైక్‌లు, 3. 94 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 12:09 PM