Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకరించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:39 AM
అడవిలో ఓ దున్నపోతు ఎండ వేడికి తాళలేక ఓ బురద గుంటలో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన సింహం.. దున్నపోతును చూస్తుంది. మెల్లిగా దగ్గరికి వెళ్తుంది. ఈ క్రమంలో చివరకు జరిగిన ఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

సింహాన్ని చూస్తే మనుషులతో పాటూ జంతువులకూ ఒంట్లో వణుకు పుడుతుంది. అలాంటిది సింహం ఎదరుగా వచ్చిందంటే చాలు.. దేని దారిన అవి పారిపోవడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మిగతా జంతువులను చూసి సింహాలు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ దున్నపోతు బురదలో పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా.. సింహం మెల్లిగా వెళ్లి కాలితో తట్టి మరీ పలకరించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ దున్నపోతు ఎండ వేడికి తాళలేక ఓ బురద గుంటలో పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అటుగా వచ్చిన సింహం.. దున్నపోతును చూస్తుంది. మెల్లిగా దగ్గరికి వెళ్తుంది. అయితే దాన్ని వేటాడే ధైర్యం చేయలేక.. ఒకసారి పలకరించి చూద్దామని అనుకుంటుంది.
Jugad Viral Video: ఐడియా అదిరింది బ్రదర్.. ఏసీని ఫ్రీగా ఎలా సెట్ చేశాడో చూడండి..
కాలిని పైకి ఎత్తి.. ‘‘హాయ్.. దున్న.. ఓసారి ఇటు చూడవా’’.. అన్నట్లుగా పలకరిస్తుంది. మొదట పట్టించుకోని దున్నపోతుకు.. రెండో సారి పిలిచేసరికి.. విపరీతమైన కోపం వస్తుంది. ‘‘ఎహే.. ప్రశాంతంగా పడుకుని ఉంటే.. ఎవరు విసిగిస్తున్నారు’’.. అన్నట్లుగా ఆవేశంతో పైకి లేచి వెనక్కు తిరుగుతుంది. సింహాన్ని చూసిన తర్వాత పారిపోకుండా.. మరింత కోపంతో దాన్ని వెంటపడుతుంది. దున్నపోతు ఆవేశం చూసిన సింహం.. ‘‘దీని ఆవేశం చూస్తుంటే.. కొమ్ములతో కుళ్లపొడిచేలా ఉంది.. పారిపోవడం బెటర్’’.. (lion ran away after seeing buffalo) అనుకుంటూ అక్కడి నుంచి ఉడాయిస్తుంది.
Viral Video: సమయాన్ని ఆదా చేయడమంటే ఇదేనేమో.. బస్సులో ఇతడి నిర్వాకం చూస్తే..
ఈ తమాషా సంఘటన పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దున్నపోతు ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పడుకున్న దున్నపోతును కెలికితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూప మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 5 .80 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Donkey Funny Video: గాడిద తెలివికి వింత పరీక్ష.. చివరకు ఎలా నెగ్గిందో చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..