Funny Tomato Video: ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:54 PM
ఒక్క టమాటాకు రూ.1300 ($16) ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి దాన్ని తెరచి చూడగా.. అందులో టమాటా ప్రత్యేకతలు తెలియజేస్తూ ఓ రెజ్యూమ్ కూడా ఉంటుంది. దీని ప్రత్యేకతలు చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కూరగాయల ధరలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. అధిక ధరకు అమ్ముడుపోయే కూరగాయలను చూస్తుంటాం. తాజాగా, ఒక్క టమాట ధర చూసి అంతా షాక్ అవుతున్నారు. రూ.1300 వెచ్చించి కొనుగోలు చేసిన టమాటాకు ఓ రెజ్యూమ్ కూడా జత చేసి ఉంది. ఈ టమోటా ప్రత్యేకతలు చూసి అంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ టమోటా వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఒక్క టమోటాకు (Tomato) రూ.1300 ($16) ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి దాన్ని తెరచి చూడగా.. అందులో టమోటా ప్రత్యేకతలు తెలియజేస్తూ ఓ రెజ్యూమ్ కూడా ఉంటుంది. అందులో టమాటాను ఎలాంటి పరిస్థితుల్లో పండించారో వివరించారు.
Funny Viral Video: కారులో మాజీ ప్రధాని.. కారు బయట ఉష్ణ పక్షి.. చివరకు జరిగింది చూస్తే..
ఈ టమోటాను సున్నితమైన వ్యవసాయ పద్ధతుల మధ్య పెంచినట్లు చెప్పారు. అలాగే వీటి సాకుకు వెదురు పనిముట్లను వినిగించారట. అలాగే ప్రత్యేకమైన మట్టిని తెప్పించారని కూడా ప్రస్తావించారు. వర్షపు నీటిని చల్లడంతో పాటూ వీటిని 55 డెసిబెల్స్ కంటే తక్కువగా శబ్ధాలు వచ్చే ప్రాంతంలో పెంచినట్లు వివరించారు. ఈ టమోటా కవర్‌పై కూడా టమోటా బొమ్మను చిత్రీకరించడం చూడొచ్చు. ఈ టమోటాను కట్ చేసి రుచి చూసిన ఆ వ్యక్తి.. ‘‘ఈ టమోటా రుచి 16 డాలర్లు చెల్లించే విధంగా ఉందా అని అంటూనే.. ఈ టమోటా కోసం 12 డాలర్లు చెల్లించవచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.
Lion VS Buffalo: పడుకున్న దున్నపోతును పలకలించిన సింహం.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మాకు ఈ టమోటా లాంటి జీవితం గడపాలని ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఒక్క టమోటా ఇంత ఖరీదా.. ఇందులో అంత స్పెషల్ ఏముందీ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 88 వేలకు పైగా లైక్‌లు, 4.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Jugad Viral Video: ఐడియా అదిరింది బ్రదర్.. ఏసీని ఫ్రీగా ఎలా సెట్ చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..