Optical illusion: మీ కంటి చూపులో సమస్యే లేదా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న కుక్కను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:18 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో తాడు పట్టుకుని, తన పెంపుడు కుక్క కోసం ఇంట్లో వెతుకుతుంటాడు. ఈ గదిలో అతడి పక్కన ఓ టేబుల్, దాని పక్కన సోఫా కనిపిస్తుంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ కుక్క పిల్ల దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

మన కంటికి పరీక్ష పెడుతూ మెదడుకు రిలీఫ్ ఇచ్చే అనేక సాధనాలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తునే ఉంటాయి. అయితే వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ తదితర చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాలు చూసేందుకు సాధారణంగానే కనిపిస్తుంటాయి. కానీ అందులో మన కంటికి కనిపించకుండా అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తాజాగా, మీ ముందుకు ఇలాంటి ఆసక్తికర ఆప్టికల్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాక్కున్న కుక్కను 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో తాడు పట్టుకుని, తన పెంపుడు కుక్క కోసం ఇంట్లో వెతుకుతుంటాడు. ఈ గదిలో అతడి పక్కన ఓ టేబుల్, దాని పక్కన సోఫా కనిపిస్తుంటుంది.
అలాగే టేబుల్‌పై పుస్తకాలు, పెన్నులు, పూల కుండీలు వంటి అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే సోఫా పక్కనే లైటు, ఆ పక్కనే ఉన్న అల్మారాలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. ఇలా ఈ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి కానీ.. ఏ జంతువూ ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించవు.
Optical illusion: చేపలు పడుతున్న ఈ వ్యక్తికి.. హుక్ ఎక్కడుందో 20 సెకన్లలో వెతికి పెట్టండి చూద్దాం..
అయితే మీ కంటికి కనిపించకుండా ఓ కుక్క పిల్ల (hidden puppy) ఇదే ఇంట్లో దాక్కుని ఉంటుంది. అయితే దాన్ని ఆ యజమాని మాత్రం గుర్తించలేకపోతుంటాడు. చాలా మంది ఆ కుక్కను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఆ కుక్కను కనుక్కునేందుకు గుర్తించగలుగుతున్నారు.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న టోపీని 10 సెకన్లలో గుర్తించారంటే.. మీరు తోపే..
ఇంకెందుకు ఆలస్యం ఆ కుక్క ఎక్కడుందో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ కుక్కను గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..