Share News

Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:16 PM

పాము, కొండచిలువ మధ్య షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీటిలో వేట కోసం పొంచి ఉన్న మొసలికి ఓ కొండచిలువ కనిపించింది. మొసలి వద్దకు వచ్చిన కొండచిలువ తల పైకి ఎత్తి అత్యంత సమీపానికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

నీటిలో ఉన్న మొసలి ఎంత శక్తివంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి జంతువునైనా నీటిలోకి లాగి చంపగలదు. అయితే ఇలాంటి మొసలి కూడ కొన్నిసార్లు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. కొన్నిసార్లయితే చిన్న చిన్న జంతువుల చేతిలోనూ దారుణంగా ఓడిపోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మొసలి, కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొండచిలువ, మొసలి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పాము, కొండచిలువ మధ్య షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీటిలో వేట కోసం పొంచి ఉన్న మొసలికి ఓ కొండచిలువ కనిపించింది. మొసలి వద్దకు వచ్చిన కొండచిలువ తల పైకి ఎత్తి అత్యంత సమీపానికి వచ్చింది.

Chain Snatching Video: మహిళ మెడలో చైన్ లాగాలని చూశాడు.. చివరికి జరిగింది చూసి ఖంగుతిన్నాడు..


సమీపానికి వచ్చిన కొండచిలువను మొసలి వెంటనే నోటితో పట్టేసుకుంది. దీంతో కొండచిలువ కాసేపు విలవిల్లాడిపోయింది. మొసలి నుంచి విడిపించుకునే క్రమంలో దాన్ని చుట్టేసి గట్టిగా పట్టుకుంది. ఇలా చాలా సేపు రెండింటి మధ్య (Python and Crocodile Fight) బిగ్ ఫైట్ జరిగింది. దీంతో చివరకు మొసలి వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కొండచిలువ చుట్టేయడంతో ఉక్కిరిబిక్కిరి అయిన మొసలి.. ‘‘దీన్ని ఇలాగే పట్టుకుని ఉంటే.. ఊపిరాడకుండా చంపేసినా చంపేస్తుంది.. వదిలేయడమే బెటర్’’.. అని అనుకున్నట్లుగా వెంటనే దాన్ని వదిలేస్తుంది. దీంతో కొండచిలువ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Woman Viral Video: ఎందుకొచ్చిందో.. ఎందుకెళ్లిందో.. మెట్రోలో యువతి నిర్వాకం చూసి అంతా షాక్..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలికి చుక్కలు చూపించిన కొండచిలువ’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 13 కోట్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Drone Funny Video: డ్రోన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. వీళ్లు ఏం చేస్తున్నారో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 12:19 PM