Snake Viral Video: పాము ముందు నాగిని పాట.. సడన్‌గా ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - May 03 , 2025 | 04:56 PM
పామును చూడగానే కొందరు యువకులకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. నాగిని పాటకు పాములు డాన్స్ చేయడం నిజమా, కాదా అనే విషయం తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో పాము ముందు ఫోన్‌లో నాగిని పాట ప్లే చేశారు. చివరకు ఏం జరిగిందో చూడండి..

పాము కనబడగానే.. బ్యాగులోని బూర తీసుకుని ఊదడం.. ఆ వెంటనే పాము కాస్తా పడగ విప్పి డాన్స్ చేయడం.. వంటి సీన్లు సినిమాలో చూస్తుంటాం. నిజంగా పాములు ఇలా డాన్స్ చేస్తాయో లేదో తెలీదు గానీ.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు.. పాము ముందు నాగిని పాట ప్లే చేయగానే చివరికి ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పామును చూడగానే కొందరు యువకులకు ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. నాగిని పాటకు పాములు డాన్స్ చేయడం నిజమా, కాదా అనే విషయం తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో పాము ముందు ఫోన్‌లో నాగిని పాట ప్లే చేశారు.
Bathroom Funny Photo: బాత్‌రూమ్‌లో సీసీ కెమెరా.. దాని కింద ఏం రాశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇంకేముందీ.. ఆ పాట స్టార్ట్ అయిన కొద్ది సేపటికి.. ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా ముందుకు వెళ్తున్న పాము.. ఆ పాట వినగానే ఒక్కసారిగా ఆగిపోయి అటూ, ఇటూ ఊగుతూ డాన్స్ చేసింది. మధ్య మధ్యలో కిందపడి పల్టీలు కొడుతూ (snake danced to Nagini song) కూడా డాన్స్ చేసింది. దీంతో అక్కడున్న యువకులంతా అవాక్కయ్యారు. ఇలా ఆ పాము చాలా సేపు నాగిని పాటకు డాన్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేసింది.
Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పాము వేడి కారణంగా అలా మెలికలు తిరుగుతోంది.. అది డాన్స్ కాదు..’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా లైక్‌లు, 27.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Woman Viral Video: ఈ సూప్ తాగే ధైర్యం ఉందా.. ఎలా చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..