Viral Video: బోల్తా పడిన కారు.. దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా.. ఈ చిన్నారి చేస్తున్న నిర్వాకం చూడండి..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:02 PM
బోల్తా కొట్టిన ఓ కారు దొర్లుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పడిపోయింది. కారులో ఉన్న తండ్రి, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ప్రమాదకర విన్యాసాలు కూడా చేస్తున్నారు. ప్రమాదాలకు గురైనా కూడా మళ్లీ మళ్లీ రీల్స్ చేస్తూ వీడియోలు చేయడం సర్వసాధారణమైంది. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బోల్తా పడిన కారులో నుంచి గాయాలతో బయపడిన చిన్నారి.. ఆ వెంటనే చేసిన నిర్వాకంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారులో వెళ్తున్న ఓ కుటుంబం (car accident) ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది. బోల్తా కొట్టిన కారు దొర్లుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పడిపోయింది. కారులో ఉన్న తండ్రి, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది.
Viral Video: పని చేస్తున్నారా.. ప్రాణాలు తీసుకుంటున్నారా.. వీడియో చూస్తే గండె గుబేల్‌మనడం ఖాయం..
గాయాలతో బయటపడిన పిల్లాడు.. ఎలాంటి భయం లేకుండా, ఆ సమయంలోనూ రీల్స్ చేస్తున్నాడు. కెమెరాకు ఫోజులు ఇస్తూ పుష్ప సినిమాలోని ‘‘తగ్గేదేలే’’... అంటూ గడ్డం కింద చేయి పెట్టి డైలాగ్ చెప్పాడు. పక్కనే ఆ పిల్లాడి సోదరి, తండ్రి కూడా గాయాలతో నిలబడి ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా చిన్న పిల్లలు ఎవరైనా భయంతో ఏడుస్తుంటారు. కానీ ఈ పిల్లాడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా.. రీల్స్ చేయడం (boy doing reels) అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Doctor Viral Video: వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘చిన్న పిల్లలకు ఫోన్లు ఇస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..