Viral Video: దొంగ ఇంట్లోకి వస్తే తెలిసేలా.. ఇతను వాడిన ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Feb 04 , 2025 | 08:27 PM
దొంగలు ఇంట్లోకి రాకుండా చాలా మంది చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఒకవేళ దొంగలు ఇంట్లోకి వచ్చినా వెంటనే తెలిసేలా కొంతమంది అలారం ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడయోలో ఓ వ్యక్తి చేసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు..

చోరీలు జరక్కుండా చాలా మంది వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణంగా ఎవరైనా ఇంటి తలుపులకు బలమైన తాళాలు వేస్తుంటారు. కొందరు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా చూస్తుంటాం. ఇంకొందరు లక్షలు ఖర్చు చేసి అత్యాధునిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి తన ఇంట్లోకి దొంగ వస్తే వెంటనే హెచ్చరించేలా విచిత్రమైన ఏర్పాట్లు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోకి దొంగలెవరైనా వస్తే వెంటనే తెలియడం కోసం విచిత్రమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. సాధారణంగా తలుపు వేసి, తాళాలు వేయడం ఎవరైనా చేసే పనే. అయితే దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వచ్చినా అందరికీ వెంటనే తెలిసేందుకు ఇతను ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
Viral Video: ఇదేం రివేంజ్‌రా బాబోయ్.. యువతి చెంపదెబ్బ కొట్టిందని.. చివరకు ఏం చేశాడో చూడండి..
చివరకు అతడికి ఓ ఐడియా తట్టింది. వెంటనే వంట గదిలోకి వెళ్లి స్టీలు ప్లేటు తీసుకుని వచ్చాడు. తలుపు మూయగానే.. తలుపు చెక్కపై ఉన్న (man hangs steel plate at the door) ఇనుప కడ్డీకి ప్లేటును వేలాడదీశాడు. ఒకవేళ ఎవరైనా తలుపు తీసేందుకు ప్రయత్నిస్తే.. ఆ వెంటనే స్టీలు ప్లేటు కిందపడిపోయి పెద్ద శబ్ధం వస్తుంది. దీంతో ఇంట్లోని వారు అలెర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్లేటు సాయంతో విచిత్రమైన ఏర్పాట్లు చేసిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దొంగలేమో కానీ.. ఎలుకలు కిందపడేసి నిద్రను చెడగొట్టే ప్రమాదం ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘తలుపు నుంచి కాకుండా కిటికీ నుంచి వస్తే ఎలా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 7.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..