Viral Video: తెలివంటే ఇదే.. సిమెంట్ పని చేస్తున్నా.. వీళ్ల తెలివితేటలు అమోఘం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 04 , 2025 | 06:02 PM
కొందరు కార్మికులు సిమెంట్ పని చేస్తుంటారు. ఓ పెద్ద గొయ్యి తవ్విన వారు.. అందులో మొత్తం సిమెంట్ వేస్తారు. దాన్ని ఓ ట్యాంక్ తరహాలో గోడలతో పాటూ, కింద మొత్తం సిమెంట్‌తో ఫ్లోరింగ్ వేస్తారు. అయితే అందులోకి దిగిన వ్యక్తిని చివరకు బయటికి తీసుకొచ్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

చేసే పని ఎలాంటిదైనా తెలివితేటలు ఉపయోగిస్తే ఎంతో సులభంగా, వేగంగా అయిపోతుంది. అంతా చేసే పనులను కొందరు తమకు బుర్రకు పదును ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద పనులను సైతం చిన్న చిన్న ట్రిక్స్ వాడి సింపుల్‌గా చేస్తుంటారు. ఇలాంటి చిత్రచివిత్రమైన ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సిమెంట్ పని చేస్తున్న కొందరు.. తమ తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుంతలో సిమెంట్ పని చేస్తనున్న వ్యక్తిని చివరకు బయటికి ఎలా తీసుకొచ్చారో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కార్మికులు సిమెంట్ పని చేస్తుంటారు. ఓ పెద్ద గొయ్యి తవ్విన వారు.. అందులో మొత్తం సిమెంట్ వేస్తారు. దాన్ని ఓ ట్యాంక్ తరహాలో గోడలతో పాటూ, కింద మొత్తం (worker putting cement in pit) సిమెంట్‌తో ఫ్లోరింగ్ వేస్తారు. అందులోకి దిగిన ఓ వ్యక్తి ఎంతో చాకచక్యంగా మొత్తం సిమెంట్ వేసి పని పూర్తి చేస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది.
Viral Video: పిల్లలకు చపాతీలు చేస్తున్న తల్లి.. మధ్యలో తన ప్రేమను ఎలా చూపించిందో చూడండి..
సిమెంట్ ఫ్లోరింగ్ వేసిన తర్వాత.. ఆ గుంతలో నుంచి బయటికి రావడం పెద్ద సమస్యగా మారుతుంది. గుంత చాలా లోతుగా ఉండడంతో పాటూ మొత్తం సిమెంట్ వేయడంతో ఎక్కడానికి వీలు లేకుండా ఉంటుంది. అయితే గుంతలో ఉన్న అతన్ని పైన ఉన్న వారు ఎంతో చాకచక్యంగా బయటికి తీసుకొస్తారు. ఇందుకోసం ఓ నిచ్చెనను తీసుకొచ్చి.. గుంతకు అటూ, ఇటూ నిలబడి పట్టుకుంటారు. గుంతలో ఉన్న వ్యక్తి పైకి ఎగిరి నిచ్చెనను పట్టుకుంటాడు. తర్వాత అతన్ని సింపుల్‌గా పైకి ఎత్తి ఒడ్డుకు తీసుకొస్తారన్నమాట.
Camel Viral Video: వామ్మో.. ఒంటె ఇలా తింటుందేంటీ.. స్వీటు మధ్యలో ముళ్ల కాయను పెట్టగా.. చివరకు..
ఇలా గుంతలో ఉన్న వ్యక్తిని తమ తెలివితో ఎంతో సులభంగా పైకి తీసుకొచ్చి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 48 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..