Viral Video: గుడ్డును పట్టుకోబోయి ఇలా చేశాడేంటీ.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:19 PM
ఓ వ్యక్తి చేతిలో కొన్ని గుడ్లను పట్టుకుని నడుస్తూ వెళ్తుంటాడు. అయితే ఇంతలో అతడికి ఓ వ్యక్తి ఎదురుపడతాడు. అతడి చేతిలోని గుడ్లలో ఒకదాన్ని తీసుకుని గాల్లోకి విసిరేస్తాడు. అతను గుడ్డును అలా విసిరేయగానే.. ఆ వ్యక్తి దాన్ని పట్టుకోవాలని చూసి చివరకు..

కొందరు తెలివిగా చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొందరు అతి తెలివితో చేసే పనులు చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటాయి. అయితే ఇంకొందరు మాత్రం అతి తెలివితో పాటూ అమాకత్వంతో చేసే పనులు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గుడ్డు కిందపడకుండా పట్టుకోవాలని చూసి చివరకు నాలుక్కరుచుకున్నాడు. ఈ వీడయో చూసిన వారంతా ‘‘ఈ అంకుల్ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేతిలో కొన్ని గుడ్లను పట్టుకుని నడుస్తూ వెళ్తుంటాడు. అయితే ఇంతలో అతడికి ఓ వ్యక్తి ఎదురుపడతాడు. అతడి చేతిలోని గుడ్లలో (eggs) ఒకదాన్ని తీసుకుని గాల్లోకి విసిరేస్తాడు. అతను గుడ్డును అలా విసిరేయగానే.. ఆ వ్యక్తి దాన్ని పట్టుకోవాలని చూసి చివరకు చేతిలో అన్ని గుడ్లను వదిలేస్తాడు.
గాల్లోకి విసిరిన గుడ్డును అయితే పట్టుకున్నాడు గానీ.. తీరా చూస్తే చేతిలోని మొత్తం గుడ్లు మాత్రం నేలపాలయ్యాయి. చివరకు తాను చేసిన బిగ్ మిస్టేక్ తెలుసుకుని అవాక్కవుతాడు. చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: దొంగ ఇంట్లోకి వస్తే తెలిసేలా.. ఇతను వాడిన ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఒక గుడ్డు కోసం మొత్తం గుడ్లను పోగొట్టుకున్నాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి అమాయకత్వం చూస్తుంటే తెగ నవ్వు వస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇదేం రివేంజ్‌రా బాబోయ్.. యువతి చెంపదెబ్బ కొట్టిందని.. చివరకు ఏం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..