Viral Video: పని చేస్తున్నారా.. ప్రాణాలు తీసుకుంటున్నారా.. వీడియో చూస్తే గండె గుబేల్‌మనడం ఖాయం..
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:55 PM
ఇద్దరు యువకులు ఓ పెద్ద బిల్డింగ్‌లో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని మీకు సందేహం రావొచ్చు. వాళ్లు పని చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. పనిలో భాగంగా బిల్డింగ్ పైఅంతస్తులో వాళ్లు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు ఎంతో సిన్సియారిటీతో పని చేస్తుంటారు. మరికొందరు తమ ప్రాణాలను ఫంగా పెట్టి మరీ పని చేస్తుంటారు. ఇంకొందరు పని చేయడం చూస్తే చావుతో చెలగాటమాడినట్లు ఉంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు పని చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వీళ్లు పని చేస్తున్నారా.. లేక చావుతో చెలగాటమాడుతున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు ఓ పెద్ద బిల్డింగ్‌లో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందీ.. అని మీకు సందేహం రావొచ్చు. వాళ్లు పని చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. పనిలో భాగంగా బిల్డింగ్ పైఅంతస్తులో మెట్ల ప్రాంతం వద్ద (Ceiling bulb installation) బల్బు బిగించాల్సి వస్తుంది. అయితే చేతికి అందనంత ఎత్తులో ఉండడంతో పాటూ ప్రమాదకర ప్రాంతంలో పని చేయాల్సి వస్తుంది.
Viral Video: గుడ్డును పట్టుకోబోయి ఇలా చేశాడేంటీ.. ఇతడి తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..
బల్బు సెట్ చేయడం కోసం వారు నిచ్చెనను తీసుకొస్తారు. అయితే అక్కడ నిచ్చెన వేసేందుకు అవకాశం లేని పరిస్థితి ఉంటుంది. దీంతో చివరకు వారు ఎంతో తెలివగా వ్యవహరిస్తారు. ముందుగా గోడకు నిచ్చెనను వేసి, అది జారకుండా ఓ వ్యక్తి తన కాళ్ల సాయంతో పట్టుకుని ఉంటాడు. మరో యువకుడు నిచ్చెన పైకి ఎక్కి సీలింగ్‌పై బల్బు మార్చేస్తాడు. అయితే ఆ సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా మెట్ల పక్కన నుంచి నేరుగా కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. అయినా వారు ఏమాత్రం భయం లేకుండా ఆ పనిని పూర్తి చేశారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాక్కూడా పని చేస్తారా.. చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6300కి పైగా లైక్‌లు, 2.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: దొంగ ఇంట్లోకి వస్తే తెలిసేలా.. ఇతను వాడిన ట్రిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..