Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:08 PM
ఎలా పడిపోయిందో ఏమో గానీ.. ఓ పులి అనూహ్యంగా ఓ బావిలో పడిపోయింది. దాంతో పాటూ ఓ పంది కూడా అదే బావిలో పడిపోయింది. పందిని చూడగానే వెంటాడి వెంటాడి చంపేసే పులి.. తన పక్కనే పంది ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

ప్రాణభయం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. ప్రాణాల మీదకు వచ్చిన సందర్భాల్లో పక్కనే ఆహారం ఉన్నా కూడా తినలేని పరిస్థితి ఉంటుంది. పులులు, సింహాలు కూడా ఇందుకు మినహాంపు కాదు. ఇందుకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకే బావిలో పులి, పంది చిక్కుకుపోయాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సియోని జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా పులికి ఎలాంటి జంతువు కనిపించినా.. దాని బారి నుంచి తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. వెంటాడి వెంటాడి మరీ దాడి చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది.
Viral Video: పని చేస్తున్నారా.. ప్రాణాలు తీసుకుంటున్నారా.. వీడియో చూస్తే గండె గుబేల్‌మనడం ఖాయం..
ఎలా పడిపోయిందో ఏమో గానీ.. ఓ పులి అనూహ్యంగా ఓ బావిలో పడిపోయింది. దాంతో పాటూ ఓ పంది కూడా (tiger and pig fell into the same well) అదే బావిలో పడిపోయింది. పందిని చూడగానే వెంటాడి వెంటాడి చంపేసే పులి.. తన పక్కనే పంది ఉన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. బావి నుంచి ఎలా బయటపడాలో తెలీక సతమవుతున్న పులి.. తన ప్రాణాలు కాపాడుకునేందుకే ప్రయత్నిస్తోంది కానీ.. పందిని చంపాలని మాత్రం అనుకోలేదు. దీంతో పంది కూడా ధైర్యంగా పులి పక్కనే అటూ, ఇటూ తిరుగుతూ తన ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇలా పులి, పంది కలిసి చాలా సేపు అదే బావిలో ఉండిపోయాయి. దీన్ని గమనించిన ఫారెస్ట్ సిబ్బంది చివరకు ఓ బోనును బావిలోకి దింపగా.. చాలా సేపటి తర్వాత పులి అందులోకి దూరిపోయింది. ఇలా ఆ రెండింటినీ కాపాడి అడవిలో వదిలేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులికైనా ప్రాణభయం తప్పలేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అందుకే ఎంతటివారికైనా గర్వం పనికిరాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2200కి పైగా లైక్‌లు, 1.81 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Doctor Viral Video: వైద్యం పేరుతో తల్లిదండ్రుల సమక్షంలోనే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..