Share News

Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:27 PM

ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. ఇంతలో దూడం కాస్త దూరంగా వెళ్తుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన కొన్ని సింహాలు.. దూడను టార్గెట్ చేస్తాయి. దానిపై పంజా విసిరి చంపేయాలని చూస్తాయి. అయితే చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..

Lions VS Buffaloes: చుట్టుముట్టిన సింహాలతో గేదె పోరాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..

జీవితంలో భయం కంటే పెద్ద శత్రువు ఏదీ లేదు.. అని పెద్దలు అంటుంటారు. ఇది మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. కొన్ని జంతువులు క్రూర మృగాలకు సులభంగా దొరికిపోవడం చూస్తుంటాం. అయితే మరికొన్ని జంతువులు మాత్రం.. ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని సింహాలు ఓ గేదెను చుట్టుముట్టేస్తాయి. తీరా దాన్ని చంపేసే సమయంలో ధైర్యంగా వాటిపై తిరగబడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. ఇంతలో దూడం కాస్త దూరంగా వెళ్తుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన కొన్ని సింహాలు.. దూడను టార్గెట్ చేస్తాయి. దానిపై పంజా విసిరి (Lions tried to attack calf) చంపేయాలని చూస్తాయి. ఇంతలో గమనించిన తల్లి గేదె.. పరుగెత్తుకుంటూ వచ్చి సింహాలతో పోరాడుతుంది.

Optical illusion: మీ కంటి చూపులో సమస్యే లేదా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న కుక్కను 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


సింహాలన్నీ చుట్టుముట్టి చంపాలని చూసినా ఏమాత్రం భయపడకుండా తన పిల్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మధ్య మధ్యలో ఎన్నిసార్లు దూడను చంపాలని చూసినా.. తల్లి గేదె ఏమాత్రం వెనక్కు తగ్గకుండా (buffalo chased away the lions) వాటితో తలపడుతుంది. ఇంతలో మరికొన్ని గేదెలు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి తల్లి గేదెకు సాయం చేస్తాయి. అన్నీ కలిసి సింహాలను పరుగులు పెట్టిస్తాయి. గేదెలన్నీ కలిసి తిరగడబడడంతో సింహాలు షాకై పారిపోతాయి. చేసేదేమీ లేక దూరంగా నిలబడి ఉండిపోతాయి.

Crocodile VS Python: పట్టుకున్న మొసలి.. చుట్టేసిన కొండచిలువ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఇలా సింహాలతో ధైర్యంగా పోరాడి ప్రాణాలు దక్కించుకున్న గేదెను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గేదె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన గేదె’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 లక్షలకు పైగా లైక్‌లు, 24. 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Chain Snatching Video: మహిళ మెడలో చైన్ లాగాలని చూశాడు.. చివరికి జరిగింది చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 01:27 PM