BJP MP Tejasvi Surya: గాయనితో బీజేపీ ఎంపీ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:56 PM
BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య గురువారం ప్రఖ్యాత కర్ణాటక గాయకురాలు శివశ్రీ స్కందప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ ప్రైవేట్ వేడుకలో దగ్గరి కుటుంబ సభ్యులు, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య వంటి ముఖ్య రాజకీయ నేతలు హాజరయ్యారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి. సోమన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.
భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తేజస్వీ దేశంలో అత్యంత చిన్న వయసు ఎంపీగా గుర్తింపు పొందారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన తేజస్వీ సూర్య (BJP MP Tejasvi Surya).. ప్రముఖ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్‌ను పెళ్లాడారు. కాగా, రిసెప్షన్ ఎంపీ స్వస్థలం బెంగళూరులోని గాయత్రి విహార్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరగనుందని సమాచారం.
శివశ్రీ స్కందప్రసాద్ ఎవరు?
చెన్నైకు చెందిన శివశ్రీ స్కందప్రసాద్ కర్ణాటక సంగీతం, భరతనాట్యం కళల్లో నిష్ణాతురాలు. బహుముఖప్రజ్ఞాశాలి. బయో ఇంజనీరింగ్ పూర్తయ్యాక మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయుర్వేద కాస్మోటాలజీలోనూ డిప్లొమా చేశారు. పొన్నియిన్ సెల్వన్’ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు సాధించారు.
Read Also : Hair Stolen: ఎవర్రా మీరంతా.. రూ. కోటి విలువైన జుట్టు దోచుకెళ్లారు..
Bird flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు
Heri Vijay: దిష్టిబొమ్మలుగా ఉంటే ప్రయోజనం ఏంటి..