Home » Annamalai
బీజేపీ ఎవరినీ మోసం చేసే పార్టీ కాదని, అలాగని మోసపోయే పార్టీ కాదని బీజేపీ నేత అన్నామలై తెలిపారు. కోయంబత్తూర్ నుంచి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా పార్టీకి ఒక లక్షణం ఉందని, మేము ఎవరినీ ఓడించమని, ఏ పార్టీని కిందకు నెట్టి ఎదగాలని కోరుకోమన్నారు.
కాంగ్రెస్‌కు ఊపిరిలూదిన కామరాజర్‌ను డీఎంకే నేతలు అవమానించినందుకు నిరసనగా, కనీస గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి వైదొలగాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై సూచించారు. నగరంలో గురువారం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... సమర్ధవంతమైన పాలకుడు కామరాజర్ ఓటమికి డీఎంకే ప్రధాన కారణమన్నారు.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కె.అన్నామలై హిమాలయాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బాబా గుహలో ఆయన ధ్యానం మొదలుపెట్టారు. గత రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీ రాష్ట చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడుగా నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చకు కొద్దిరోజుల్లో తెరపడనుందా. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారా. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తే ఆ ఎంపిక ఎవరు..
తమిళనాడు బీజేపీ అధ్యక్షపదవికి అజిత్ అన్నామలై కొనసాగాలని ఆసక్తి వ్యక్తం చేయలేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా ఆయన దీనిపై మరింత వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు.