Share News

BJP Annamalai: బీజేపీ ఎవరినీ మోసం చేసే.. మోసపోయే పార్టీ కాదు

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:25 PM

బీజేపీ ఎవరినీ మోసం చేసే పార్టీ కాదని, అలాగని మోసపోయే పార్టీ కాదని బీజేపీ నేత అన్నామలై తెలిపారు. కోయంబత్తూర్‌ నుంచి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా పార్టీకి ఒక లక్షణం ఉందని, మేము ఎవరినీ ఓడించమని, ఏ పార్టీని కిందకు నెట్టి ఎదగాలని కోరుకోమన్నారు.

BJP Annamalai: బీజేపీ ఎవరినీ మోసం చేసే.. మోసపోయే పార్టీ కాదు

- బీజేపీ నేత అన్నామలై

చెన్నై: బీజేపీ(BJP) ఎవరినీ మోసం చేసే పార్టీ కాదని, అలాగని మోసపోయే పార్టీ కాదని బీజేపీ నేత అన్నామలై(Annamalai) తెలిపారు. కోయంబత్తూర్‌ నుంచి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మా పార్టీకి ఒక లక్షణం ఉందని, మేము ఎవరినీ ఓడించమని, ఏ పార్టీని కిందకు నెట్టి ఎదగాలని కోరుకోమన్నారు. అదే సమయంలో మేము బలపడానికి కోరుకుంటామన్నారు. ఈ కూటమి ఏర్పాటులో తన ప్రమేయం లేదన్నారు. కానీ, డీఎంకేను గద్దెదింపాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. కూటమికి వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదన్నారు.


nani4.2.jpg

కోయంబత్తూర్‌లో ఎడప్పాడి పళనిస్వామి తన పర్యటన ప్రారంభించిన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి పాల్గొన్నారన్నారు. నాకంటూ ఒక మర్యాద ఉందని, ఆహ్వానం లేకుండా అనవసర వేదికలకు వెళ్లనన్నారు. పదవుల కోసం తాను ఎన్నడూ వెంటపడలేదని, రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఉల్లిపాయ వంటిదని మాత్రమే అన్నానని అన్నామలై పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

జోరుగా వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 22 , 2025 | 12:25 PM