Share News

Annamalai: గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి తప్పుకోండి..

ABN , Publish Date - Jul 18 , 2025 | 10:59 AM

కాంగ్రెస్‏కు ఊపిరిలూదిన కామరాజర్‌ను డీఎంకే నేతలు అవమానించినందుకు నిరసనగా, కనీస గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి వైదొలగాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై సూచించారు. నగరంలో గురువారం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... సమర్ధవంతమైన పాలకుడు కామరాజర్‌ ఓటమికి డీఎంకే ప్రధాన కారణమన్నారు.

Annamalai: గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి తప్పుకోండి..

- కాంగ్రెస్‏కు అన్నామలై సూచన

- బేషరతు క్షమాపణ చెప్పాలి

- తమిళిసై, జీకే వాసన్‌ డిమాండ్‌

చెన్నై: కాంగ్రెస్‏కు ఊపిరిలూదిన కామరాజర్‌ను డీఎంకే నేతలు అవమానించినందుకు నిరసనగా, కనీస గౌరవం కోసమైనా ఆ కూటమి నుంచి వైదొలగాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) సూచించారు. నగరంలో గురువారం అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... సమర్ధవంతమైన పాలకుడు కామరాజర్‌ ఓటమికి డీఎంకే ప్రధాన కారణమన్నారు. 1967 ఎన్నికల్లో కామరాజర్‌ను ఓడించేందుకు డీఎంకే ఎన్నో అబద్ధాలు చెప్పిందన్నారు.


అనంతరం కాంగ్రెస్‌ రెండుగా చీలిన సమయంలో, ఆ పార్టీని నిరోధించేందుకు డీఎంకే, ఇందిరాగాంధీతో ఎలా పనిచేసిందో 1971 ఎన్నికలు ఉదాహరణ అన్నారు. కామరాజర్‌ గురించి మాట్లాడేందుకు డీఎంకేకు అర్హత లేదన్నారు. 1967 ఎన్నిక సమయంలో కరుణానిధి మాటలు, అన్ని విషయాలు బయటకు తీసి చూపితే, గౌరవం ఉన్న ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా డీఎంకే కూటమిలో ఉండలేరన్నారు. చివరి వరకు ఆస్తులు కూడబెట్టని సాధారణ వ్యక్తి కామరాజర్‌ అని,


nani2.4.jpg

డీఎంకే, అన్నాడీఎంకేలు ఒకే పాత్రలో ఊరిన మామిడి టెంకలని కామరాజర్‌ చెప్పారని గుర్తుచేశారు. చరిత్రను వక్రీకరించి మాట్లాడిన డీఎంకే నేత తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి మాటలు విన్న తరువాత కూడా కాంగ్రెస్‌ ఎలా మౌనంగా ఉండగలుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారం చేపడుతుందని కేంద్రమంత్రి అమిత్‌ షా తెలిపారని, ఆయన మాటలే తమకు వేదవాక్కు అని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకు ఏవైనా అభ్యంతరాలుంటే అమిత్‌ షాతో మాట్లాడుకోవాలని అన్నామలై సూచించారు.


నిరాడంబర శిఖరంపై విమర్శలా...?

నిరాడంబరంగా జీవించిన కామరాజర్‌ను డీఎంకే నేత విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంపీ తిరుచ్చి శివ బేషరతు క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్‌ నేత తమిళిసై, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌ వేర్వేరు ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 18 , 2025 | 10:59 AM