Share News

BJP: అత్యాచారం కేసులో రహస్యాలివిగో.. ఆ సార్‌ ఎవరో సమాధానం చెప్పండి

ABN , Publish Date - Jun 04 , 2025 | 10:20 AM

బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని అన్నామలై ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..

BJP: అత్యాచారం కేసులో రహస్యాలివిగో.. ఆ సార్‌ ఎవరో సమాధానం చెప్పండి

- రెండు రోజుల్లో మరిన్ని ఆధారాలతో వస్తా

- బీజేపీ నేత అన్నామలై

చెన్నై: అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన అత్యాచారం కేసుతో కోట్టూరుపురం డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగంకు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంకు సంబంధాలున్నాయని బీజేపీ రాష మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. అత్యాచార కేసులో బాధితురాలికి సంపూర్ణంగా న్యాయం చేకూరలేదని, అందుకే తాను సేకరించిన ఆధారాలను వెల్లస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 23 రాత్రి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు జ్ఞానశేఖరన్‌ను బంధించి స్టేషన్‌కు తీసుకెళ్ళిన కోట్టూరుపురం పోలీసులు స్టేషన్‌లో ఉంచకుండా విడిచిపెట్టారు.


ఆ రోజు రాత్రే ఈ అత్యాచారం కేసుతో ఎవరెవరికి సంబంధాలున్నాయో ఆ ఆధారాలన్నీ నాశనం చేశారని ఆరోపించారు. 23 రాత్రి నిందితుడు జ్ఞానశేఖర్‌ మొబైల్‌ ఫ్లైట్‌మోడ్‌లో ఉన్నమాట వాస్తవమేనని, ఆ తర్వాతే అంటే రాత్రి 8.52 తర్వాత అతడు సీనియర్‌ పోలీసు అధికారికి ఫోన్‌ చేసిన మాట నిజమేనన్నారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ హోదా కలిగిన ఆ పోలీసు అధికారి రాత్రి 9.01 గంటలకు జ్ఞానశేఖరన్‌కు ఎందుకు ఫోన్‌ చేశారో తెలియటం లేదన్నారు. ఇక ఈ కేసులో సీబీసీఐడీ నమోదు చేసిన రెండో ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) ఏ దశలో ఉందో వెల్లడించలేదన్నారు.


nani1.2.jpg

డిసెంబర్‌ 24 ఉదయం నుండి సాయంత్రం దాకా జ్ఞానశేఖరన్‌ డీఎంకే స్థానిక నాయకుడు కోట్టూరు షణ్ముగం ఆరుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, అదే రోజు రాత్రి కోట్టూరు షణ్ముగం, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యంతో ఫోన్‌ మాట్లాడారన్నారు. ఈ అత్యాచారం కేసులో ఏ సార్‌ను కాపాడేందుకు డిసెంబర్‌ 24 రోజంతా ఈ తతంగం జరిగిందో, దాని వెనుక దాగిన మర్మమేమిటో త్వరలోనే తాను వెల్లడిస్తానని అన్నామలై చెప్పారు. ఇక అన్నావిశ్వవిద్యాలయం ఉద్యోగి నటరాజన్‌, డీఎంకే స్థానిక నాయకుడు షణ్ముగం 23 రాత్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని, ఆ తర్వాత వరుసగా మూడు రోజులు నటరాజన్‌, షణ్ముగం 13 సార్లు ఫోన్‌లో సంభాషించుకున్నట్టు పేర్కొన్నారు.


బాధితురాలికి బెదిరింపు..

అత్యాచారానికి గురైన బాధితురాలి వద్దకు ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు వెళ్ళి జరిగిన సంఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండా కేసు వాపసు చేసుకోవడం మంచిదని, లేకుంటే సమాజంలో అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరించారన్నారు. ఆ ఇద్దరు పోలీసు అధికారులు ఎవరో అన్ని వివరాలు తన దగ్గరున్నాయని, ప్రస్తుతం తాను చేస్తున్న ఆరోపణలపై సీఎం స్టాలిన్‌ బదులిస్తే వాస్తవాలను వెల్లడిస్తానన్నారు. తాను సేకరించిన ఆధారాలను పరిశీలించిన మీదట డిసెంబర్‌ 24వ తేదీ రాత్రి అత్యాచారం కేసుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ నాశనం చేశారని అన్నామలై ఆరోపించారు.


కోట్టూరు షణ్ముగం్ద, ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యంను హైకోర్టు నియమించిన సిట్‌, ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. జ్ఞానశేఖరన్‌పై ఇంకో అత్యాచారం కేసు కూడా ఉందని చెబుతున్న పోలీసులు ఆ కేసు ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు. తానడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ బదులివ్వాలని, మరో రెండు రోజుల్లో మరిన్ని ఆధారాలతో ప్రజల ముందు వస్తానని అన్నామలై ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 10:20 AM