BJP: రాష్ట్రంలో రానున్నది సంకీర్ణం కాదు.. బీజేపీ పాలనే
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:06 AM
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.

- ఈపీఎస్కు అన్నామలై షాక్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య చిచ్చురేపేలా కనిపిస్తోంది. కోయంబత్తూరులో డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను గురువారం ఉదయం కలుసుకున్న అన్నామలై.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 యేళ్లు పూర్తయిందని, ప్రధాని మోదీ సుస్థిర పాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయాన్ని కేంద్రం ప్రభుత్వం వందశాతం మళ్ళీ తిరిగిచ్చేలా వివిధ పథకాలను కూడా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఎన్నికల మేనిఫెస్టోలోని 50హామీలను కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు.
కోయంబత్తూరు విమానాశ్రయం విస్తరణకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థలసేకరణ ఇంకా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈ సారి శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని, ఈ విషయమై తాను ప్రధాని మోదీకి ఎలాంటి లేఖలు రాయలేదని విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం లో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పలేనని, రానున్నది బీజేపీ పాలన మాత్రమేనని చెప్పగలనని అన్నామలై పేర్కొన్నారు. పార్టీ అధిష్టానవర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా తాను కట్టుబడి పనిచేస్తాననని అన్నామలై చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి.
9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ
రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు
Read Latest Telangana News and National News