Home » AIADMK
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు.
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు.
కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
ద్రావిడ మోడల్ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి.
తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్ నివాళులర్పించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.