Minister Raghupati: మంత్రి సంచలన కామెంట్స్.. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ..
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:20 PM
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.
- మీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడం
- మంత్రి రఘుపతి
చెన్నై: డీఎంకే(DMK)ని చిత్తుగా ఓడిస్తానని, ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తానని టీవీకే నేత విజయ్ చేస్తున్న ప్రగల్భాలను గమనించి అందరూ నవ్వుకుంటున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి(Minister Raghupati) విమర్శించారు. పుదుకోటలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే(TVK) తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 75 యేళ్లుగా సుస్థిరమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న డీఎంకేని పత్తా లేకుండా చేస్తామని బెదిరించిన రాజకీయ దిగ్గజాలంతా పత్తాలేకుండా పోయారనే విషయం విజయ్‌కి తెలియడం లేదన్నారు.

డీఎంకేతో తలపడితే టీవీకే చిత్తుగా ఓడిపోతుందన్నారు. ప్రచార సభలలో చిన్న తొక్కిసలాట జరిగితే విజయ్‌లా పారిపోయే నేతలెవరూ డీఎంకేలో లేరన్నారు. అటు అన్నాడీఎంకేని, ఇటు బీజేపీని విమర్శించని టీవీకే బీజేపీకి సీ-టీమ్‌లాగే వ్యవహరిస్తోందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News