Home » Assembly elections
అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పర్యటించారు.
డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్ వాకింగ్‌కు వెళ్తుండగా ఓపీఎస్ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.
రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిన అన్నాడీఎంకే పథకాలను అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1967, 1977 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల తరహాలోనే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయని టీవీకే అధినేత విజయ్ జోస్యం చెప్పారు. యేళ్లతరబడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు ఆ రెండు ఎన్నికలు గుణపాఠం చెప్పాయని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఘనవిజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
‘మా కూటమిలోనే బీజేపీ ఉంది, అదే సమయంలో బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత కూటమిపై స్పష్టత వస్తుంది. ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే ఉన్నందున ఆలోగా మరిన్ని పార్టీలు మా కూటమిలోకి వస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు.
రెండో దెబ్బ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూపై పడుతుందని, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో జన్ సురాజ్ వైపు మళ్లుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జన్ సురాజ్ ఊపు ఇదేవిధంగా కొనసాగితే మూడో దెబ్బ బీజేపీపై పడుతుందని అన్నారు.
రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం కోసం-స్వేచ్ఛ కోసం’అనే కొత్త ప్రచార పథకానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీల్లో డీఎంకే ప్రభుత్వం 99 శాతం నెరవేర్చకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపించిందన్న పదాలతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రంలో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ పార్టీలను, నేతలను అడ్డుకుంటామని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బూత్‌కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వంపై అమిత్ షా, ఎడప్పాడి పళనిస్వామి కలిసి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు. స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చిన తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిధులు వెచ్చించి‘ఉంగళుడన్ స్టాలిన్’ పేరుతో డీఎంకే ఎన్నికల ప్రచారం చేపట్టిందని ఆరోపించారు.