Share News

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:15 AM

అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్‌షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్‌షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.

Speaker Sevam: విజయ్‌ రోడ్‌షోకు అనుమతి నిరాకరణ

- పుదుచ్చేరి స్పీకర్‌ సెల్వం

పుదుచ్చేరి: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(TVK Vijay) ఈ నెల 5వ తేదీ పుదుచ్చేరి(Puduchery)లో చేపట్టదలచిన రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీవీకే వినతిపత్రాన్ని పరిశీలించిన ఐజీ అజిత్‌కుమార్‌సింగ్‌ అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపట్ల టీవీకే శ్రేణులు, విజయ్‌ అభిమానులు తీవ్ర నిరాశతో వున్నారు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌ సెల్వం పోలీసుల వైఖరిని సమర్థించారు.


nani1.jpg

విజయ్‌కు అనుమతివ్వకపోవడం మంచిదేనని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్‌షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ఇక్కడ పెద్దరోడ్లు లేవన్నారు. అవసరమైతే విజయ్‌ ప్రైవేటుగా ఓ మైదానాన్ని ఎంపిక చేసి అందులో సభ జరుపుకోవడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 11:15 AM