Home » Hero Vijay
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్‌స్పీకర్లు, అంబులెన్స్‌కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
ఇటీవల తంజావూరు జిల్లా సింగిపట్టి పర్యటనకు వచ్చిన టీవీకే అధినేత విజయ్ కారు వెంట బైక్‌తో పరుగులుతీసి ప్రమాదానికి గురైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్‌లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సీబీఐ విచారణ నిమిత్తం.. తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడి సీబీఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు విజయ్‌ని విచారించి.. ఆయన వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.
తమిళ స్టార్ విజయ్ అభిమానుల మధ్య కారు ఎక్కబోతూ కింద పడిపోయారు. అయితే.. భద్రతా సిబ్బంది తక్షణమే అప్రమత్తం కావడంతో క్షేమంగా బయటపడ్డారాయన. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్‌దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.