Share News

TVK Vijay: పుదుచ్చేరిలో రోడ్‌ షోకు అనుమివ్వండి..

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:47 AM

డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్‌ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.

TVK Vijay: పుదుచ్చేరిలో రోడ్‌ షోకు అనుమివ్వండి..

- 5న పుదువైలో విజయ్‌ రోడ్‌షో

- పోలీసుల అనుమతి కోరుతూ టీవీకే దరఖాస్తు

పుదుచ్చేరి: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షులు విజయ్‌ డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్‌ షో నిర్వహించనున్నారు. టీవీకే పేరుతో పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌(Actor Vijay), రాబోయే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహిస్తున్న విజయ్‌, కరూర్‌ ఘటనతో ప్రచారం తాత్కాలికంగా విరమించారు. మళ్లీ వచ్చే నెల నుంచి ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టారు.


nani3.2.jpg

ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో డిసెంబరు 5వ తేది విజయ్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు పుదుచ్చేరి ఉప్పలం, సోనాంపాళయం వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతంలో విజయ్‌ ప్రసంగించనున్నారని అందుకు అనుమతించాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే నేతలు రాష్ట్ర డీజేపీకి దరఖాస్తు చేసుకున్నారు.


nani3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2025 | 11:47 AM