TVK Vijay: హీరో, టీవీకే చీఫ్ విజయ్‌కి పోలీసుల షాక్... ఆయన ప్రచారానికి..
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:49 PM
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..
- టీవీకే విజయ్ విజయ్ ప్రచారానికి అనుమతి నిరాకరణ
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay) సేలంలో చేపట్టనున్న ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్, రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా సెప్టెంబరు 27వ తేది కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందారు. ఈ సంఘటన కారణంగా తన ప్రచారాన్ని విజయ్ తాత్కాలికంగా వాయిదావేశారు. ఈ క్రమంలో, ఇటీవల నగరంలో జరిగిన టీవీకే ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశంలో పాల్గొన్న విజయ్, తన రాజకీయ ప్రయాణం ఇకనుంచి వేగంగా ఉంటుందని చెబుతూ, అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రసంగించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శులు, నామక్కల్, కరూర్ జిల్లాల్లో ప్రచారం చేయడం తాత్కాలికంగా వాయిదావేసి, మిగిలిన జిల్లాల్లో ప్రచారం ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఆ ప్రకారం, సేలం నుంచి విజయ్ తన ప్రచారం మళ్లీ ప్రారంభిస్తారని సమాచారం. అందుకోసం ఆ జిల్లా నేతలు ప్రచార సభల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆ ప్రకారం, విజయ్ ప్రచార సభకు అనుమతివ్వాలని కోరుతూ గురువారం సేలం జిల్లా ఎస్పీకి టీవీకే నేతలు దరఖాస్తు చేసుకున్నారు.

అందులో, డిసెంబరు 4వ తేది విజయ్ ప్రచారం ఉంటుందని, అందుకు బోస్ మైదానం, కోట మైదానం, గెజ్జలనాయకన్‌పట్టి ప్రాంతాల్లో అనుమతులివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో, డిసెంబరు 4వ తేది విజయ్ ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్తీక దీపోత్సవం పనులు జరుగుతున్న దృష్ట్యా, ప్రచారానికి తగిన భద్రత కల్పించలేమని, 4వ తేది తర్వాత మరేదైనా తేదీలో అనుమతిస్తామని జిల్లా పోలీసు శాఖ తెలిపిందని సేలం సెంట్రల్ జిల్లా టీవీకే కార్యదర్శి పార్తీపన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News