Premalatha: విజయ్‌పై ప్రేమలత ఫైర్.. 41 మంది ప్రాణాలు పోయినా..
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:13 PM
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్‌లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
- ఇప్పటికీ నోరు మెదపడం లేదు
- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత
చెన్నై: కరూర్‌లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(DMDK General Secretary Premalatha) ఆరోపించారు. ‘ఉల్లం తేడి ఇల్లం నాడి’ అనే పేరుతో ఆమె రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దిండుగల్ జిల్లా వేడచందూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు తమ పార్టీ బలాన్ని నిరూపించుకునే పరీక్షలన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకునేందుకు పలు పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించినా, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపడం లేదని, గతంలో విజయకాంత్ జీవించివున్నపుడు జరిగిన తమ పార్టీ మహానాడులో చిన్నపాటి తొక్కిసలాట జరిగితే విజయ్‌కాంత్ క్షేత్రస్థాయికి వెళ్ళి దాన్ని ఆపారని ఆమె గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
Read Latest Telangana News and National News