Share News

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:13 PM

గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌ ధ్వజమెత్తారు.

TVK Vijay: దుష్ట పరిపాలనకు చరమగీతం పాడతాం...

- టీవీకే అధినేత విజయ్‌ ధ్వజం

చెన్నై: గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్‌(Vijay) ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అయితే ఎక్కడా డీఎంకే పేరు ప్రస్తావించకుండా ఆ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేశారు.


ఇటీవల కాలంలో పాలన, అధికారం తమ చేతుల్లో వుందని విర్రవీగుతున్న ఓ పార్టీ ఎప్పటిలాగే ప్రత్యర్థులపై అపవాదులను, పసలేని ఆరోపణలను, విమర్శలు చేయడానికి సిద్ధమైపోయిందన్నారు. ఆ పార్టీ పేరు ఏమిటో తన ప్రకటన ద్వారానే అందరికీ ఈపాటికీ తెలినే ఉంటుందని డీఎంకేని పరోక్షంగా ప్రస్తావించారు. అవినీతి అక్రమాలకు పెట్టింది పేరుగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం టీవీకేపై దుమ్మెత్తి పోయడాన్నే పనిగా పెట్టుకుందని విజయ్‌ విమర్శించారు.


1969 నుండి ఆ పార్టీ తన ప్రత్యర్థులపై అపవాదాలు వేయడాన్నే పనిగా పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతూనే ఉందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తమ సిద్ధాంతాలను తెలిపి ప్రచారం చేయడానికి బదులుగా ఎప్పటిలాగే తమిళనాడు, తమిళ భాష, తమిళ జాతి, సంప్రదాయం అంటూ ఊదిన శంఖాలనే మళ్ళీ మళ్లీ ఊది ప్రజల చెవుల్ని ఊదరగొడుతోందని విజయ్‌ విమర్శించారు. తాజాగా ‘మేఽథో ఉత్సవాలు’ పేరుతో అటకెక్కిన పాత గ్రంథాలను, తాళపత్రాల దుమ్ముధూళి తట్టి ప్రదర్శన శాలలు నిర్వహించే స్థితికి ఆ పార్టీ దిగజారి పోయిందని విమర్శించారు.


nani5.2.jpg

పార్టీ పతాకం 75 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లోనూ టీవీకేపైనే విమర్శలు చేశారని, వీటన్నింటికీ తోడు ‘సర్‌’కు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ధర్నాలోనూ టీవీకేపైనే తీవ్ర విమర్శలు చేశారని విజయ్‌ పేర్కొన్నారు. ప్రజాబలంతో దూసుకు వస్తున్న టీవీకే ధాటికి రాష్ట్రంలోని అవినీతి అక్రమాల ప్రభుత్వం కుప్పకూలి పడటం ఖాయమని ఆయన జోస్యం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 12:13 PM