Share News

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:26 AM

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వెల్లడించారు.

EPS: పొత్తుపై టీవీకేతో మంతనాలు జరపలేదు..

- ఎడప్పాడి పళనిస్వామి

చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు పసుంపొన్‌ ముత్తురామలింగ దేవర్‌ 118వ జయంతి, 63వ వార్షిక గురుపూజోత్సవం సందర్భంగా రామనాథపురం జిల్లా పసుంపొన్‌ దేవర్‌ స్మారక మందిరంలో ఉన్న ఆయన శిలావిగ్రహానికి అన్నాడీఎంకే తరఫున మాజీమంత్రులతో కలిసి ఈపీఎస్‌ నివాళులర్పించారు.


అనంతరం ఆయన మదురై జిల్లా కబ్బలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విజయ్‌తో పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదని, కూటమిపై రాయబారా లు జరుగుతున్నట్లు సొషల్‌మీడియాల్లో వచ్చే కథనాలు అవాస్తవాలన్నారు. తాను పాల్గొంటు న్న ప్రచార సభల్లో కొంతమంది టీవీకే జెండాలతో వచ్చి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. మాజీముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), మాజీమంత్రి సెంగోటయ్యన్‌, టీటీవీ దినకరన్‌ డీఎంకే బీటీంగా వ్యవహరిస్తున్నారని,


nani3.2.jpg

వీరి కుట్రల వల్లే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రాలేకపోయిందని విమర్శించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి, పార్టీ నిబంధనలను అతిక్రమించేవారు ఎవరైనా సహించేది లేదని, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని ఆయన మరోమారు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) జాబితా సవరణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈపీఎస్‌ సమాధానం చెబుతూ, ఎస్‌ఐఆర్‌ అంటే సహజంగా భయపడాల్సింది ప్రతిపక్షాలలేనని,


అయితే రాష్ట్రంలో అధికార డీఎంకే దీనిపై ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం కావడం లేదన్నారు. రైతుల నుండి ఏడాదికి సుమారు 42లక్షల టన్నుల దాన్యం కొనుగోలు చేసినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అబద్ధాలు చెబుతున్నారని, ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముత్తురామలింగ దేవర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ సమర్పించినట్లు ఈపీఎస్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 11:26 AM