Share News

EPS: దొంగ ఓట్లు కుదరవనే ‘సర్‌’కు వ్యతిరేకం

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:54 AM

రాష్ట్రంలో 21 ఏళ్ల అనంతరం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) వల్ల దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదన్న భయంతోనే డీఎంకే వ్యతిరేకిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఆరోపించారు.

EPS: దొంగ ఓట్లు కుదరవనే ‘సర్‌’కు వ్యతిరేకం

- డీఎంకేపై ఈపీఎస్‌ విసుర్లు

చెన్నై: రాష్ట్రంలో 21 ఏళ్ల అనంతరం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) వల్ల దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదన్న భయంతోనే డీఎంకే వ్యతిరేకిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఆరోపించారు. కోయంబత్తూర్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, అర్హత కలిగిన వారు మాత్రమే ఓటరు జాబితాలో ఉండాలన్న దృష్టితో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‘సర్‌’ ప్రక్రియను రాష్ట్రంలో ప్రారంభించిందన్నారు.


nani2.jpg

గతంలో 8 సార్లు ఓటరు జాబితాను సవరించారని, అయితే ఆ జాబితాల్లో మరణించినవారు, వలస వెళ్లి వారి పేర్లు కూ డా ఉండడంతో, వాటిని తొలగిండచడమే ‘సర్‌’ ఉద్దేశమని, ఈ ప్రక్రియను వ్యతిరేకించడం సరికాదన్నారు. డీఎంకే, మిత్రపక్షాలు ‘సర్‌’ మాట వింటేనే ఉలిక్కిపడుతున్నాయని, ఈ ప్రక్రియ పారదర్శకంగా, సకాలంలో పూర్తిచేసేందుకు బీఎల్వోలున్నారని తెలిపారు. నగరంలో దొంగఓటు వేసేందుకు యత్నించిన డీఎంకే నిర్వాహకులను మాజీ మంత్రి డి.జయకుమార్‌ పట్టించారని, ఓటరు జాబితా సవరణల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకోవాలే కానీ, వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 11 , 2025 | 10:54 AM