Chennai News: మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్స్.. మోదీ.. మా డాడీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:33 PM
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
- అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ
చెన్నై: కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ(Rajendra Balaji) పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది అన్నాడీఎంకే(AIADMK) అధికారంలో ఉన్నప్పుడేనని, ఐదు రైల్వే వంతెనలకు శంకుస్థాపన చేసి రెండింటిని ప్రారంభించినట్లు తెలిపారు.

కేంద్రప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటేనే రాష్ట్రాల్లో అభివృద్ధి చూడగలమని, అయితే ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) అభివృద్ధిపై దృష్టిసారించడంలేదన్నారు. ప్రధాని మోదీని డాడీగా భావిస్తున్నామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకేల కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తంచేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News