Rahul Gandhi : మళ్లీ పరువునష్టం కేసులో ఇరుక్కున్న రాహుల్ గాంధీ.. సమన్లు జారీ చేసిన కోర్టు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:10 AM
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Rahul Gandhi Army Defamation Case : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు. చాన్నాళ్ల కిందట ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టనుంది. భారత్ జోడో యాత్ర సమయంలో భారత సైనికులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసుకు సంబంధించి లక్నో కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ACJML) అలోక్ వర్మ రాహుల్‌కు సమన్లు జారీ చేశారు. ఈ కేసు విచారణ తేదీని మార్చి 24, 2025 తేదీగా నిర్ణయించారు.
ఇంతకీ విషయం ఏమిటంటే?
దాదాపు రెండేళ్ల కిందట కాంగ్రెస్ అగ్రనేత భారత ఆర్మీపై చేసిన వ్యాఖ్యలను అప్పట్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ తీవ్రంగా ఖండించారు. మేం సైన్యాన్ని గౌరవిస్తాం. కానీ, రాహుల్ గాంధీ సైన్యాన్ని ఎగతాళి చేయడం ద్వారా సైనికుడి పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన తరపున న్యాయవాది వివేక్ తివారీ రాహుల్ గాంధీపై పరువు నష్టం ఆరోపణలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో డిసెంబర్ 16, 2022న 'భారత్ జోడో' యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, డిసెంబర్ 9, 2022న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు పరిశీలించిన అనంతరం లక్నో న్యాయస్థానం రాహుల్ గాంధీకి మార్చి 24న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
భారత సైనికుల గురించి ఏమన్నారంటే..
రాహుల్ గాంధీ మీడియాతో 'భారత్ జోడో యాత్ర గురించి ప్రజలు చాలా అడుగుతారు. కానీ చైనా సైనికులు మన సైనికులను కొట్టడం గురించి ఒక్కసారి కూడా అడగరు' అని వ్యాఖ్యానించినట్లు న్యాయవాది వివేక్ తివారీ పేర్కొన్నారు. వాస్తవానికి డిసెంబర్ 9న భారత్, చైనా సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తరువాత భారత సైన్యం ' చైనా ఆక్రమణల కారణంగా ఈ ఘర్షణ జరిగిందని.. మేము తగిన సమాధానం ఇచ్చి చైనా సైనికులను తరిమికొట్టామని' ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘర్షణలో ఇరుపక్కలా ఉన్న కొందరు సైనికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
Chhattisgarh HC: భర్త చేసే బలవంతపు శృంగారం నేరం కాదు ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు తీర్పు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.